4 వేల ఈస్కూటర్లను ఆఫర్ చేస్తాం

4 వేల ఈస్కూటర్లను ఆఫర్ చేస్తాం

2021–22 మూడో క్వార్టర్‌‌‌‌‌‌‌‌ కల్లా పూర్తిగా ఎలక్ట్రిక్ వెహికల్సే

న్యూఢిల్లీ: షేర్డ్ మొబిలిటీ ప్లాట్‌‌‌‌ఫామ్ బౌన్స్ ఫిబ్రవరి నాటికి తన ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌పై 4 వేల ఎలక్ట్రిక్ స్కూటర్లను యాడ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2022 మూడో క్వార్టర్‌‌‌‌‌‌‌‌ నాటికి 100 శాతం ఎలక్ట్రిక్ వెహికల్స్‌‌‌‌నే ఆఫర్ చేయాలని భావిస్తోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి తాము గ్రీన్ మొబిలిటీలోకి మారుతున్నామని, 2020 ఫిబ్రవరి నుంచి తమ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌పై యాడ్ చేస్తోన్న ప్రతి వెహికల్ ఎలక్ట్రిక్‌‌‌‌దే ఉంటుందని కంపెనీ సీఈవో, కోఫౌండర్ వివేకానంద హల్లెకెరే చెప్పారు. 2021–22 మూడో క్వార్టర్ ముగిసే నాటికి బౌన్స్ 100 శాతం ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌గా మారనుందని చెప్పారు.

గత కొన్ని నెలలుగా బౌన్స్ డైలీ రైడ్స్ స్థిరంగా పెరుగుతున్నాయని, ప్రస్తుతం ప్రీ కరోనా లెవెల్స్‌‌‌‌లో 35 శాతానికి చేరుకున్నట్టు పేర్కొన్నారు. లాక్‌‌‌‌డౌన్‌‌‌‌కు ముందు రోజూ 1.3 లక్షల రైడ్స్‌‌‌‌ను బౌన్స్‌‌‌‌ను చేపట్టిందన్నారు. బౌన్స్ ప్రస్తుతం మూడు ప్లాన్స్‌‌‌‌లో కస్టమర్లకు బైక్స్‌‌‌‌ను ఆఫర్ చేస్తోంది. షార్ట్ టర్మ్ రెంటల్స్(ఎస్‌‌‌‌టీఆర్), లాంగ్ టర్మ్ రెంటల్స్(ఎల్‌‌‌‌టీఆర్), రైడ్‌‌‌‌షేర్‌‌‌‌‌‌‌‌ వంటి ప్లాన్స్‌‌‌‌ను ఇది అందిస్తోంది. రోజుకు 2–12 గంటలు బైక్‌‌‌‌ను రెంట్‌‌‌‌కు తీసుకునేలా ఎస్‌‌‌‌టీఆర్ ఉంది. ఎల్‌‌‌‌టీఆర్ కింద 15–45 రోజులు బైక్‌‌‌‌ను రెంట్‌‌‌‌కి తీసుకోవచ్చు. అన్ని బైక్‌‌‌‌లు పూర్తిగా శానిటైజ్ చేసే ఉంటాయని, అన్ని సేఫ్టీ ప్రొటోకాల్స్‌‌‌‌ను పాటిస్తున్నామని బౌన్స్ చెప్పింది.