40 రోజులు.. దట్టమైన అడవిలో.. ఆ పిల్లలు ఏం తిన్నారు.. ఎలా బతికారు..

40 రోజులు.. దట్టమైన అడవిలో.. ఆ పిల్లలు ఏం తిన్నారు.. ఎలా బతికారు..

అమెజాన్ అడవిలో విమానం కూలిన 40 రోజుల తర్వాత తప్పిపోయిన నలుగురు చిన్నారుల అచూకీని రెస్క్యూ టీమ్ ఇటీవలే గుర్తించింది. వారిని సురక్షితంగా రక్షించి, వైద్యం అందించింది. వీరిలో 13, 9, 4, 11నెలల పసిబిడ్డ కూడా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో ఇన్ని రోజులు అడవిలో సజీవంగా కనిపించడం ఓ అద్భుతం అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలోనే వీరు ఈ 40 రోజులు ఆ దట్టమైన అడవిలో ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఏం తిన్నారు.. అనే విషయాలు చర్చనీయాంశంగా మారాయి.

నలుగురు స్వదేశీ పిల్లలు తమ పెంపకం కారణంగా తినదగినవి అని తెలిసిన విత్తనాలు, మూలాలు, మొక్కలను తిని బతికి బయటపడ్డారు. తమకు అందుబాటులో ఉన్న కసావా పిండిని వీరు తిన్నట్టు తెలుస్తోంది.  అమెజాన్ అడవుల్లో ఉండే అనకొండలు, జాగ్వార్స్ లాంటి భయంకరమైన జంతువుల బారిన పడకుండా ఈ చిన్నారులు బయటపడడం మామూలు విషయం కాదని పలువురు అంటున్నారు. అడవికి దగ్గరగా నివసించే చిన్నారుల కుటుంబాలకు అడవి పట్ల జ్ఞానం ఉంటుందని, అలాగే ఈ పిల్లలకు కూడా ఆ అవగాహన వచ్చుండొచ్చని చెబుతున్నారు. అడవిలో ఉండే కోతులు లాంటి జంతువులను చూసి, వీరు బతకడం నేర్చుకున్నారని, అవి తినే పండ్లనే వారు కూడా తిని ఉంటారని, ఆకులపై పడ్డ నీళ్లను తాగి ఉంటారని, రాత్రి వేళల్లో దోమలు, పాముల నుంచి కాపాడుకునేందుకు పొదలను ఉపయోగించుకుని ఉంటారని చెబుతున్నారు.