40 లక్షల మందికి ఇంకా పీఎఫ్‌ వడ్డీ పడలేదు

40 లక్షల మందికి ఇంకా పీఎఫ్‌ వడ్డీ పడలేదు
  • కేవైసీ సమస్యలే కారణం

న్యూఢిల్లీ: సుమారు 40 లక్షల మంది ఈపీఎఫ్‌‌‌‌ సబ్‌‌‌‌స్క్రయిబర్లకు ఇంకా వడ్డీ జమ కాలేదు. ఎంప్లాయర్స్ సైడ్ నుంచి ఉద్యోగుల కేవైసీ డిటైల్స్‌‌‌‌ మిస్ మ్యాచ్ అవ్వడంతో 2019–20 కి గాను ఇంకా కొంత మందికి వడ్డీ యాడ్‌‌‌‌ కాలేదని  ఈపీఎఫ్‌‌‌‌ఓ అధికారులు పేర్కొన్నారు.  ఈ సమస్యలను ఫీల్డ్ ఆఫీసర్లు పరిష్కరిస్తున్నారని చెప్పారు. పీఎఫ్‌‌‌‌ వడ్డీని ఇండివిడ్యువల్‌‌‌‌గా కంటే ఆర్గనైజేషన్ల పరంగా ఈపీఎఫ్‌‌‌‌ఓ వేస్తుందని పేర్కొన్నారు.  ఉద్యోగుల పీఎఫ్‌‌‌‌లకు 2019–20 కి గాను 8.5 శాతం వడ్డీని యాడ్ చేసేందుకు డిసెంబర్‌‌‌‌‌‌‌‌లోనే ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం వెలువడి రెండున్నర నెలలవుతున్నా చాలా మందికి ఇంకా  పీఎఫ్‌‌‌‌ వడ్డీ యాడ్ కాలేదు. లాక్‌‌‌‌డౌన్‌‌‌‌తో మార్కెట్లు భారీగా క్రాష్‌‌‌‌ అవ్వడంతో 2020 లో  ఈపీఎఫ్‌‌‌‌ఓ తన  ఇన్వెస్ట్‌‌‌‌మెంట్లను అమ్మలేకపోయింది. దీంతో కూడా వడ్డీ చెల్లింపులు ఆలస్యమయ్యాయని ఈ విషయం తెలిసిన  వ్యక్తులు అన్నారు.  ‘ఈపీఎఫ్‌‌‌‌ సబ్‌‌‌‌స్క్రయిబర్లలో 8–10 శాతం మందికి ఇంకా వడ్డీ పడలేదు. వీరి కేవైసీ డిటైల్స్‌‌‌‌లలో కొంత మిస్‌‌‌‌మ్యాచ్ జరిగింది. ఇండివిడ్యువల్‌‌‌‌ సబ్‌‌‌‌స్క్రయిబర్లకు బదులు ఆర్గనైజేషన్ పరంగా ఈపీఎఫ్‌‌‌‌ వడ్డీని యాడ్ చేస్తుంది’ అని ఈపీఎఫ్‌‌‌‌ఓ ఉద్యోగులు అన్నారు.

For More News..

 ప్రైవేటు బాటలో.. 4 సర్కారీ బ్యాంకులు

సరదాగా ‘ఫేక్ ఇగ్లూ’ యాడ్ ఇస్తే.. దిమ్మతిరిగింది

ఉత్తరాఖండ్ వరదల ఎఫెక్ట్.. ఢిల్లీలో నీళ్లకు కరువు

ఈ కారు నిజంగా సూపర్.. చెట్లు, కొండలెక్కుతుంది.. ఎగురుతుంది