బెంగళూరు : ఎంప్లాయీస్‌కు వచ్చే ఈమెయిల్స్‌లో 40 శాతం ఈమెయిల్స్‌ను అసలు చూడనే చూడరని ఒక సర్వే తేల్చింది. ఏవరేజ్ ప్రొఫెషనల్‌కు రోజుకి 180 దాకా ఈమెయిల్స్ వస్తుంటాయని ఈ సర్వే నిర్వహించిన హైవర్ తెలిపింది. వివిధ కంపెనీలలో పనిచేసే 1000 ఈమెయిల్ ఎకౌంట్స్ డేటాను ఇందుకోసం అధ్యయనం చేసినట్లు పేర్కొంది. దాదాపు 30 వేల ఈమెయిల్ థ్రెడ్స్‌ను, 47 లక్షల ఈమెయిల్స్‌ను పరిశీలించినట్లు వెల్లడించింది. రోజుకి సగటున వచ్చే 180 ఈమెయిల్స్‌లో 40 శాతం వాటిని అసలు ఎంప్లాయీస్ పట్టించుకోవడమే లేదని తమ అధ్యయనంలో తేలినట్లు పేర్కొంది. కంపెనీలలోని టీమ్స్‌కు ఈమెయిల్ కొలాబరేషన్ సొల్యూషన్‌ను హైవర్ అందిస్తోంది. పని చేసే చోట ఈమెయిల్ బిహేవియర్‌ని చూస్తే, ఈమెయిల్ దుర్వినియోగం అవుతున్నట్లు అర్థమవుతోందని, అనవసరమైన ఈమెయిల్స్ ఇన్‌బాక్స్‌లో చేరుతున్నట్లు తెలుస్తోందని హైవర్ పేర్కొంది. ఈమెయిల్స్ ప్రధానంగా ఓవర్‌లోడవడానికి కారణం గ్రూప్ మెయిల్సేనని, సాధారణంగా వాటిని షేర్డ్ ఇన్బాక్స్‌లు లేదా డిస్ట్రిబ్యూషన్ లిస్ట్స్‌కు పంపిస్తుంటారని హైవర్ తెలిపింది. ఎంప్లాయీస్‌కు సగటున వచ్చే ఈమెయిల్స్‌లో గ్రూప్ మెయిల్స్ 51 శాతంగా ఉంటున్నట్లు పేర్కొంది.
ఒక గ్రూప్‌లో భాగంగా వున్న ప్రతి ఎంప్లాయీ ఆ గ్రూప్ ఈమెయిల్స్‌ను తన ప్రైమరీ ఇన్‌బాక్స్‌లో అందుకోవడమే ప్రధాన సమస్యగా ఉందని తెలిపింది. బాధ్యతారహితంగా సీసీలు పెట్టడమూ అధికమైనట్లు వెల్లడించింది. నిర్ధారిత ప్రాజెక్టు లేదా ఎకౌంటుకి సంబంధించిన అప్‌డేట్స్‌ను అందించేటప్పుడు ఎంప్లాయీస్ ఈ విధంగా సీసీ చేస్తున్నారని పేర్కొంది. అనవసరమైన ఫార్వార్డింగ్ వల్లా ఇన్‌బాక్స్‌లో ఈమెయిల్స్ పెరిగిపోతున్నాయని తెలిపింది. ఈనాడు కమ్యూనికేషన్‌లో ప్రధానమైన పాత్రను ఈమెయిల్ పోషిస్తోంది. కాకపోతే, ఈ సర్వే ద్వారా వెల్లడైన అంశాలలో కొన్ని చాలా ముఖ్యమైన ప్రోబ్లమ్స్ ఉన్నాయని, ఈ నేపథ్యంలో ఈమెయిల్ విధానాలను సమీక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని హైవర్ సీఈఓ నీరజ్ రౌత్ తెలిపారు. ఎంప్లాయీస్ పంపే ఈమెయిల్స్ సంఖ్య ఓవైపు పెరుగుతుండగా, మరోవైపు వారు ఇన్బాక్స్‌లో ఓపెన్ చేసి చూసే మెయిల్స్ సంఖ్య తగ్గుతుండటం ఆశ్చర్యకరమని అభిప్రాయపడ్డారు. ఈమెయిల్‌ను కొలాబరేషన్ టూల్‌గా భావించడం వల్లే సీసీ, ఫార్వార్డ్‌లు ఎక్కువవుతున్నాయని తేలుతోందని, నిజానికి ఈమెయిల్ కొలాబరేషన్ టూల్ కాదని అర్ధం చేసుకోవాలని పేర్కొన్నారు.

