చైనా స్కూల్‌ స్టూడెంట్స్‌పై కత్తితో దాడి

చైనా స్కూల్‌ స్టూడెంట్స్‌పై కత్తితో దాడి
  • 39 మందికి గాయాలు
  • గాయపడ్డ వారిలో కొంత మంది స్టాఫ్‌

బీజింగ్‌: చైనాలోని గువాంగ్జీ ప్రావిన్స్‌లోని ఒక స్కూల్‌లో సెక్యూరిటీ గార్డ్‌ రెచ్చిపోయాడు. స్టూడెంట్స్‌పై కత్తితో దాడి చేయడంతో 39 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి సీరియస్‌గా ఉంది. వారిలో కొంత మంది స్టాఫ్‌ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వాంగ్ఫూ కంట్రీ సెంటర్‌‌ ప్రైమరీ స్కూల్‌లో ఉదయం 8:30 గంటలకు పిల్లలంతా స్కూల్‌కు వస్తున్న సమయంలో పదునైనా కత్తితో ఒక్కసారిగా విచక్షణా రహితంగా దాడి చేశాడని పోలీసులు చెప్పారు. ఈ ఘటనలో స్కూల్‌ ప్రిన్సిపల్‌కు కడా గాయాలయ్యాయన్నారు. నిందితుడిని 50 ఏళ్ల లీ షియోమిన్‌గా గుర్తించామని, అతడిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నామని చెప్పారు. గాయపడిన వారిని 8 అంబులెన్స్‌లలో దగ్గర్లోని హాస్పిటల్‌లో చేర్పించారు. చైనాలో కత్తి దాడి ఘటనలు తరచూ జరుగుతూ ఉంటాయి. ఫ్రస్టేషన్‌ ఉండే చాలా మంది ఎక్కువగా స్కూల్‌ పిల్లలపైన దాడులకు దిగుతారు. ఏటా ఎక్కడో ఒక దగ్గర ఇలాంటి దాడులు జరుగుతుంటాయి. 2018లో ఒక వ్యక్తి ఇంట్లో సమస్యల కారణంగా కిండర్‌‌ గార్డెన్‌ స్కూల్‌ స్టూడెంట్స్‌పై దాడి చేయడంతో ఇద్దరు చనిపోయారు.