చైనాలో ఒక్కరోజులో 40 వేల కరోనా కేసులు 

చైనాలో ఒక్కరోజులో 40 వేల కరోనా కేసులు 

చైనాలో కరోనా మళ్లీ విలయతాండవం చేస్తుంది. ఒక్కరోజులోనే 40 వేల కేసులు నమోదయ్యాయి. రాజధాని బీజింగ్ సహా పలు నగరాల్లో కరోనా విజృంభిస్తుండటంతో చైనా ప్రభుత్వం  కఠిన ఆంక్షలు పెడుతూ లాక్ డౌన్ విధించింది. 
చైనా అమలు చేస్తున్న జీరో కోవిడ్ ఆంక్షలపై అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో షింజియాంగ్ ప్రజలు లాక్ డౌన్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. వెంటనే లాక్ డౌన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. మూడు నెలల నుంచి ఇండ్లకే పరిమితమై ఉన్నామని, ఇకనైనా లాక్ డౌన్ తీసేయాలంటూ చైనా ప్రజలు ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. ఇప్పటివ‌ర‌కూ చైనాలో కొత్త క‌రోనా ఇన్ఫెక్షన్ కార‌ణంగా 5,232 మంది చ‌నిపోయారు.