కరోనాను తరిమి కొట్టేందుకు అమ్మవారికి గొర్రెల బలి

కరోనాను తరిమి కొట్టేందుకు అమ్మవారికి గొర్రెల బలి

ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు కరోనా పేరు వింటేనే వణికిపోతున్నాయి. వైరస్ భారిన పడుతున్న వారి సంఖ్య వరల్డ్ వైడ్ గా రోజు రోజుకీ పెరిగిపోతోంది. దీంతో వైరస్ ను అరికట్టేందుకు అన్ని దేశాలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు సైంటిస్టులు. ప్రస్తుతం వైరస్ బారిన పడకుండా ఉండేందుకు లాక్ డౌన్ ను విధించాయి అన్ని దేశాలు. అయితే కొందరు వైరస్ ను తరిమి కొట్టేందుకు గొర్రెలను బలిచ్చారు. ఒకటి..రెండు కాదు ఏకంగా 4వందల గొర్రెలు. ఈ ఘటన జార్ఖండ్ లో జరిగింది.

కరోనా వైరస్ ను తరిమి కొట్టేందుకు కొడెర్మా జిల్లాలోని ఉర్వాన్ కు చెందిన గ్రామస్తులు గ్రామదేవతకు నాలుగు వందల గొర్రెలను బలిచ్చారు. కరోనా మహమ్మారి బారి నుంచి తమ గ్రామానికి రక్షణ కలుగుతుందన్న నమ్మకంతోనే ఈ పని చేశామని తెలిపారు.  ఎలాంటి ఆటంకాలు రాకుండా తమను… గ్రామ దేవత కాపాడుతుందన్నారు. ఆ నమ్మకంతోనే గొర్రెలను బలిచ్చామన్నారు.  విషయం తెలుసుకున్న అధికారులు కేసు నమోదు చేసి… విచారణ ప్రారంభించారు.