ఫుడ్ పాయిజన్తో 41 మందికి అస్వస్థత

ఫుడ్ పాయిజన్తో 41 మందికి అస్వస్థత

నర్సాపూర్, వెలుగు: మెదక్  జిల్లా నర్సాపూర్ లో ఫుడ్ పాయిజన్ తో 41 మంది అస్వస్థతకు గురయ్యారు. పట్టణంలోని 11వ వార్డుకు చెందిన కంప్యూటర్​ ఆపరేటర్​ మహ్మద్​ అవేజ్​ పెళ్లి ఖాయమైంది. ఆదివారం పెళ్లి జరగాల్సి ఉండగా, శుక్రవారం రాత్రి నూతన గృహ ప్రవేశంతో పాటు హల్దీ ఫంక్షన్​ నిర్వహించారు. 

దీనికి బంధువులు, స్నేహితులు, చుట్టుపక్కల వారు హాజరయ్యారు. ఫంక్షన్​లో వారంతా నాన్​ వెజ్​ తిన్నారు. కొద్ది సేపటి తరువాత వాంతులు, విరేచనాలతో 41 మంది స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చేరారు. చికిత్స అనంతరం చాలా మంది కోలుకున్నారు. 9 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ముగ్గురు పిల్లలను మెరుగైన చికిత్స కోసం సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఎవరికీ ప్రమాదం లేదని ఆసుపత్రి సూపరింటెండెంట్​ పావని, ఆర్ఎంవో రాజేశ్​​తెలిపారు.