422 అవార్డులు, సంస్థలకు గాంధీ ఫ్యామిలీ పేర్లు

422 అవార్డులు, సంస్థలకు గాంధీ ఫ్యామిలీ పేర్లు

422 అవార్డులు, సంస్థలకు గాంధీ ఫ్యామిలీ పేర్లు
కాంగ్రెస్ బంధుప్రీతి దేశానికి సిగ్గుచేటు: తరుణ్ చుగ్
చండీగఢ్: రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పేరును మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా మార్చడం పట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేయడంపై బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ తరుణ్​చుగ్ మండిపడ్డారు. ఏదైనా ఓ పర్టిక్యులర్ ఫీల్డ్​లో అద్భుత విజయాలు సాధించిన వ్యక్తుల పేర్లనే ఆ రంగంలోని అవార్డులకు పెట్టడమే సరైనదని శుక్రవారం ఆయన ఓ ప్రకటనలో స్పష్టంచేశారు. దేశంలో సుమారు 422 అవార్డులు, సంస్థలు, రోడ్లు, ఎయిర్ పోర్టులకు గాంధీ ఫ్యామిలీలోని వ్యక్తుల పేర్లనే పెట్టిన కాంగ్రెస్.. రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పేరు మార్పుపై నిరసన తెలపడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాంగ్రెస్ నేతలు బంధుప్రీతిలో కూరుకుపోయినందుకే అన్నింటికీ వారి పేర్లనే పెట్టుకున్నారని విమర్శించారు. దశాబ్దాల తరబడి కాంగ్రెస్ బంధుప్రీతిలో ఎలా కూరుకుపోయిందనే విషయాన్ని వారి నిరసనలే తెలియజేస్తున్నాయని పేర్కొన్నారు. గాంధీ ఫ్యామిలీలోని వ్యక్తులు తప్ప ఇతరుల నాయకత్వాన్ని ముందుకు రాకుండా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరు దేశానికి సిగ్గుచేటన్నారు. అకడమిక్ ఎక్సలెన్స్ లేదా స్పోర్ట్స్​లో గాంధీ ఫ్యామిలీ కంట్రిబ్యూషన్ ఏమీలేకున్నా, ఆ రంగానికి సంబంధించిన సంస్థలకు వారి పేర్లను పెట్టుకోవడం ఏమిటని తరుణ్ చుగ్ ప్రశ్నించారు. గాంధీ ఫ్యామిలీలోని వ్యక్తుల పేర్లు పెట్టిన అన్ని సంస్థలు, స్థలాలపై రివ్యూ చేయాలన్నారు.