నక్సల్స్ ముప్పు.. 43 మంది బీజేపీ నేతలకు X, Y, Y+ సెక్యూరిటీ

నక్సల్స్ ముప్పు.. 43 మంది బీజేపీ నేతలకు X, Y, Y+ సెక్యూరిటీ

లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బస్తర్ డివిజన్‌కు చెందిన 43 మంది బీజేపీ నాయకులకు Y+, Y మరియు X కేటగిరీ భద్రత కల్పించింది. వీరిలో సుక్మా, బీజాపూర్, దంతేవాడ, బస్తర్, కంకేర్, నారాయణపూర్ జిల్లాలకు చెందిన నేతలు ఉన్నారు. 

 43 మంది నేతల్లో సుక్మా జిల్లాకు చెందిన వారు 6 మంది కాగా, బీజాపూర్ - 10, దంతెవాడ - 17, బస్తర్ -4, కొండగావ్-1, కంకేర్-4, నారాయణపూర్ - 1 నాయకులు ఉన్నారు. వీరిలో సుక్మా బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధనిరామ్ బర్సేకు Y+ కేటగిరీ భద్రత కల్పించగా, మరో నలుగురికి Y సెక్యూరిటీ, మిగిలిన నేతలకు X సెక్యూరిటీ కల్పించారు. ఛత్తీస్‌గఢ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఆదేశాల మేరకు నేతలకు భద్రత కల్పించారు.

అంతకుముందు బీజాపూర్ జిల్లా మావోయిస్టు ప్రభావిత జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ ముదలియార్ మార్చి 7న కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఆ లేఖలో నక్సల్స్‌ దాడికి పాల్పడవచ్చని, బస్తర్ బీజేపీ నేతలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.