టర్మినేట్ అయిన 43 మందికి.. సింగరేణిలో తిరిగి నియామకం

టర్మినేట్ అయిన 43 మందికి.. సింగరేణిలో తిరిగి నియామకం
  •  ఉత్తర్వులు జారీ చేసిన సీఎండీ
  • క్రమశిక్షణతో పని చేయాలని సూచన

సింగరేణి భవన్ : సింగరేణి సంస్థలో జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రైనీలుగా చేరి వివిధ కారణా లతో టర్మినేట్ అయిన 43 మంది ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకుంటూ యాజమాన్యం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ ఆదేశాల మేరకు వారికి మరో అవకాశం కల్పించారు. 

వీరంతా గతంలో విధులకు గైర్హాజరు కావడం, అవసరమైన సర్టిఫి కెట్లను సమర్పించకపోవడం వల్ల విధుల నుంచి తొలగించారు. వీరిని తిరిగి విధుల్లోకి తీసుకునే అంశంపై ఇటీవల డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషన ర్, సింగరేణి యాజమాన్యం, గుర్తింపు కార్మిక సంఘం మధ్య ఒప్పందం కుదిరింది. అందులో భాగంగా వారిని తిరిగి సంస్థలోకి తీసుకున్నా రు. 

►ALSO READ | హైదరాబాద్ చర్లపల్లిలో డ్రగ్స్ డెన్.. 12 వేల కోట్ల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు..

అయితే వీరు సంస్థ ఏర్పాటు చేసే హైపవర్ కమిటీ ముందు తమ వివరాలు, ఓవర్ మెన్ సర్టిఫికెట్, గ్యాస్ టెస్టింగ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఫిట్ నెస్ ఉన్నవారికి నియామకాలు అందిస్తామని సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ తెలిపారు. వీరంతా క్రమ శిక్షణతో పనిచేయాలని కోరారు.