రెండేళ్లలో సొంతింట్లోకి మారతాం...

రెండేళ్లలో సొంతింట్లోకి మారతాం...

న్యూఢిల్లీ: రెండేళ్లలో  సొంతింట్లోకి మారాలని మిలినియల్స్​లో ఎక్కువ మంది కోరుకుంటున్నట్లు ఒక సర్వేలో తేలింది. అద్దె ఇంట్లో ఉండటం కంటే సొంతంగా ఇల్లు కొనుక్కోవడమే మేలని 70 శాతం మంది మిలినియల్స్​ సీబీఆర్​ఈ సర్వేలో చెప్పారు. అన్ని ఏజ్​ గ్రూప్​లనూ కలిపి చూస్తే రెండేళ్లలో కొత్త ఇంట్లోకి మారతామని 45 శాతం మంది చెప్పినట్లు సీబీఆర్​ఈ రిపోర్టు వెల్లడించింది. తాను గ్లోబల్​గా  నిర్వహించిన సర్వే ఆధారంగా వాయిసెస్​ ఫ్రం ఇండియా :  హౌ విల్​  పీపుల్ లివ్​, వర్క్​ అండ్​ షాప్​ ఇన్​ ఫ్యూచర్​ ?  పేరిట ఒక రిపోర్టును రిలీజ్​ చేసింది.


గ్లోబల్​గా 20 వేల మందిపై సీబీఆర్​ఈ ఈ సర్వే నిర్వహించింది. ఇందులో ఇండియా నుంచి 1,500 మంది పాల్గొన్నట్లు సంస్థ తెలిపింది. వీరిలో అన్ని ఏజ్​ గ్రూప్​ల వారు....జెన్​ జెడ్​ (వయసు 18–25), లేట్​ మిలినియల్స్​ (వయసు 26–33), ఎర్లీ మిలినియల్స్​ (వయసు 34–41), జెన్​ ఎక్స్​ (వయసు (42–57), బేబీ బూమర్స్​ (వయసు 58 ప్లస్​) ఉన్నట్లు సీబీఆర్​ఈ పేర్కొంది. రాబోయే రెండేళ్లలో కొత్త ఇంట్లోకి మారాలని గట్టిగా కోరుకుంటున్న వారు 44 శాతమని, రెండేళ్ల కిందట ఇది 31 శాతమేనని రిపోర్టు తెలిపింది. 

గ్లోబల్​, ఏషియా పసిఫిక్ ​ప్రాంతాలతో పోలిస్తే ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్న వాళ్లు  మన దేశంలో చాలా ఎక్కువని వెల్లడించింది.  వచ్చే రెండేళ్ల కాలంలో సొంత ఇంట్లోకి మారాలని జెనరేషన్​ జెడ్​ బలంగా కోరుకుంటున్నట్లు వివరించింది. ఇదే బేబీబూమర్లలోనైతే 29 శాతం మందే సొంత ఇల్లు కావాలనుకుంటున్నారని పేర్కొంది. దీనిని బట్టి అర్ధం అయ్యేదేమంటే యంగ్​ జనరేషన్​లోని వ్యక్తులే హౌసింగ్​ డిమాండ్​ను ముందుండి నడిపిస్తారని సీబీఆర్​ఈ వివరించింది. ముఖ్యంగా మిలినియల్స్​లోనైతే 70 శాతం మంది అద్దె ఇంట్లో ఉండటం కంటే సొంత ఇల్లే బెటరని చెబుతున్నట్లు పేర్కొంది. 2016 లో చేసిన సర్వేలో చెప్పిన దానికి ఇప్పుడు వారు చెబుతున్నది పూర్తిగా విరుద్ధంగా ఉందని వెల్లడించింది. 2016 నాటి సర్వేలో 68 శాతం మంది మిలినియల్స్​ అద్దె ఇంట్లోనే కొనసాగుతామని చెప్పారని సీబీఆర్​ఈ రిపోర్టు పేర్కొంది. ఇప్పుడు ఈ ట్రెండ్​ పూర్తిగా రివర్సయిందని, లేట్​మిలినియల్స్​, ఎర్లీ మిలినియల్స్​ కేటగిరీ వ్యక్తులలో 70 శాతం మంది తాజాగా సొంతిల్లు కావాలనుకుంటున్నట్లు తెలిపింది. రీలొకేట్​ అయినప్పుడు సొంత ఇంటి గురించి ఆలోచిస్తామని అప్పట్లో వారు వెల్లడించినట్లు వివరించింది.

సిటీకి దూరంగా ఇష్టం...జెన్​ ఎక్స్​

ఒక్క జెన్​ ఎక్స్​ తప్ప మిగిలిన అందరూ సిటీ సెంటర్లకు దగ్గరగా ఇల్లు కావాలని కోరుకుంటున్నట్లు సీబీఆర్​ఈ సర్వేలో తేలింది. సిటీకి కొంత దూరమైతేనే బెటరని జెన్​ ఎక్స్​ వ్యక్తులు అభిప్రాయపడుతున్నట్లు రిపోర్టు పేర్కొంది. అంతేకాదు, తమకున్న అనుభవంతో వీలైతే ఇతర దేశాలకు మారాలని ఈ జెన్​ ఎక్స్​ కోరుకుంటున్నట్లు తెలిపింది. నిజానికి మన దేశంలోని అన్ని ఏజ్​ గ్రూప్​ల వ్యక్తులలోనూ విదేశాలకు వెళ్లాలనే కోరిక ఎక్కువ  ఉంది.

అద్దె ఇల్లే బెస్ట్​.. జెన్​ జెడ్​

జెన్​ జెడ్​లో 20 శాతం మంది ప్రైవేట్​ రెంటల్​ ఎకామడేషన్​ ఇష్టపడుతు న్నారని, 17 శాతం మంది స్టూడెంట్​ హౌసింగ్​, షేర్డ్​ ఎకామడేషన్​ వంటి ఆప్షన్ల వైపు చూస్తున్నారని సీబీఆర్​ఈ ఇండియా  సీఈఓ అన్షుమన్​ మేగజైన్​ చెప్పారు. రెంటల్​ ఎకామడేషన్​ను డ్రైవ్​ చేసే వ్యక్తులు వీరే కాబట్టి, డెవలపర్లు ఇందుకు తగిన స్ట్రేటజీలను చూసుకో వాలని పేర్కొన్నారు. ఇండియాలో సాధారణంగానే సొంత ఇంట్లో ఉండటానికి ఎక్కువ మంది ఇష్టప డతారని, కరోనా తర్వాత ఇది మరింత పెరిగిందని ఆయన వెల్లడించారు.