ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 46 జీపీలు ఏకగ్రీవం

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 46 జీపీలు ఏకగ్రీవం

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 46 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. కొన్ని చోట్ల సింగిల్​ నామినేషన్లు దాఖలు కాగా మరికొన్ని చోట్ల నామినేషన్లు వేసిన వాళ్లు శనివారం విత్​డ్రా చేసుకున్నారు. రెండో విడతలో ఎన్నికలు జరిగే  గాంధారి మండలంలో 18, లింగంపేటలో 14, నాగిరెడ్డిపేటలో 6, ఎల్లారెడ్డిలో 5 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. 

అలాగే ఫస్ట్ విడతలో ఎన్నికలు జరిగే  సదాశివనగర్లో 3, రాజంపేటలో 2 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. గాంధారి మండలంలోని  మేడిపల్లి, చెన్నాపూర్, దుర్గం, గొల్లాడి, గుడివేనుక తండా, హేమ్లానాయక్​ తండా, కాయిత్​తండా, లొంకతండా, నేరల్ తండా, పిస్కిల్​గుట్ట తండా, రాంపూర్​గడ్డా, సోమారం, మాతుసంగెం, సోమ్లానాయక్​ తండా, పర్మల్లతండా, తిప్పారం తండా, లింగంపేట మండలంలో లింగంపల్లిఖుర్ధు,  ఒంటర్​పల్లి,  అయ్యపల్లితండా,  బాణాపూర్,  బాణాపూర్​తండా,  మాలోతు సంగ్యానాయక్​తండా, మాలోత్​తండా, మెంగారం, ముంబాజీపల్లితండా, నల్లమడుగుపెద్ద తండా, రాంపల్లి, రాంపల్లిస్కూల్​ తండా, సజ్జనపల్లి, ఎల్లారం ఉన్నాయి. 

ఎల్లారెడ్డి మండలంలో అజమాబాద్​, హాజిపూర్​తండా, సోమర్​య్యగాడి తండా, తిమ్మాపూర్​, తిమ్మారెడ్డితండా, సదాశివనగర్​ మండలంలో సజ్జనాయక్​తండా,  తిర్మన్​పల్లి, తుక్కోజీవాడి, రాజంపేట మండలంలో గుండి తండా, షేర్​శంకర్​ ​తండా ఏకగ్రీవమయ్యాయి.

బీర్కూర్​ తండా, పిట్లంలో..

బీర్కూర్, పిట్లం: కామారెడ్డి జిల్లా బీర్కూర్​ మండలం బీర్కూర్​ తండా జీపీ సర్పంచ్​ ఎన్నికల్లో కాట్రోత్​ దేవిసింగ్​ఒక్కడే నామినేషన్​ వేశారు. ఎనిమిది వార్డులకు ఒకటి చొప్పున నామినేషన్లు వచ్చాయి. పిట్లం మండలం గౌరారం తండాలో శనివారం నామినేషన్ల ఉపసంహరణ అనంతరం కవిత ఒక్కరే మిగిలారు. రెండు పంచాయతీల్లో ఎన్నిక ఏకగ్రీవమైంది.