అభ్యర్థుల్లో 477 మంది పోస్టు గ్రాడ్యుయేట్స్ : ఏడీఆర్​ నివేదిక వెల్లడి

అభ్యర్థుల్లో 477 మంది పోస్టు గ్రాడ్యుయేట్స్ : ఏడీఆర్​ నివేదిక వెల్లడి

ఖైరతాబాద్, వెలుగు: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  పోటీ చేస్తున్న అభ్యర్థుల విద్య, నేర చరిత్ర, ఆర్థిక పరమైన అంశాలపై అసోసియేషన్​ ఫర్​డెమోక్రటిక్​ రిఫామ్స్​(ఏడీఆర్​)'తెలంగాణ  ఎన్నికల వాచ్​’ పేరిట అధ్యయనం చేసింది. ఆ  స్టడీ వివరాలను శనివారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో జరిగిన మీడియా సమావేశంలో సంస్థ  కో–ఆర్డినేటర్లు రాకేశ్​ రెడ్డి, రాంప్రాద్ వెల్లడించారు. నేర చరిత్ర ఉన్నవారికి టిక్కెట్లు ఇవ్వొద్దని ఎన్నికల కమిషన్​ఆదేశాలు ఉన్నాయని గుర్తుచేశారు. ఆ ఆదేశాలను అతిక్రమించి పలు పార్టీలు నేరస్తులకే సీట్లు కేటాయించినట్లు  తెలిపారు. అలా  ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో  పార్టీలు చెప్పాలని ప్రశ్నించారు. 2018– ఎన్నికల కంటే ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో నేర చరిత్ర ఉన్న అభ్యర్థుల సంఖ్య పెరిగిందని వెల్లడించారు.

అలాగే.. అభ్యర్థుల ఆస్తుల విలువలు కూడా పెరిగినట్లు వారు సమర్పించిన అపిడవిట్​లో ఉన్నాయని వివరించారు. అత్యధిక ఆస్తులను ప్రకటించినవారిలో నల్గొండ జిల్లా మునుగోడు అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి 458 కోట్లు, బాల్కొండ అభ్యర్థి ముత్యాల సునీల్​కుమార్​104 కోట్లు, మంచిర్యాల జిల్లా చెన్నూరు అభ్యర్థి గడ్డం వివేకానంద్​606 కోట్లు చూపారని వివరించారు. విద్యార్హతకు వస్తే 2290 మంది అభ్యర్థుల్లో పోస్టు గ్రాడ్యుట్స్​477, గ్రాడ్యుట్స్​392, డాక్టరేట్స్​32 మంది ఉండగా.. నిరక్షరాస్యులు  89 మంది ఉన్నట్లు స్టడీ పేర్కొంది.