బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపిక

బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపిక

జనగామ అర్బన్, తొర్రూరు (పెద్దవంగర), బచ్చన్నపేట,  భీమదేవరపల్లి, వెలుగు:  బాసర ట్రిపుల్​ఐటీకి జనగామ జిల్లా నుంచి 49 మంది విద్యార్దులు ఎంపికయ్యారని కలెక్టర్​ రిజ్వాన్​ బాషా షేక్​ తెలిపారు. కొడకండ్ల, రఘునాథపల్లి, లింగాల ఘనపూర్, చిల్పూర్​, జనగామ విద్యార్థులను శనివారం అభినందించారు. 

డీఈవో భోజన్న తదితరులున్నారు. పెద్దవంగర ఉన్నత పాఠశాల నుంచి మేఘన, శ్రీవల్లి, ఎండీ.అప్సర్, కీర్తన, అజయ్, చిట్యాల ఉన్నత పాఠశాల నుంచి అభిషేక్, భవాని, మహేశ్, స్వాతి, యజ్ఞ, అవుతాపురం ఉన్నత పాఠశాల నుంచి శివతేజ, స్పందన, బొమ్మకల్ ఉన్నత పాఠశాల నుంచి నితిన్ ఎంపికయ్యారని ఎంఈవో శ్రీనివాస్ పేర్కొన్నారు. బచ్చన్నపేట మోడల్ స్కూల్ స్టూడెంట్ వైష్టవి బాసర ట్రిపుల్​ఐటీకి ఎంపికైందని ప్రిన్సిపాల్​భారతిదేవి తెలిపారు. ముల్కనూర్ మోడల్ స్కూల్​ నుంచి అక్షయ ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ రెహమాన్ పేర్కొన్నారు.