Health Tips : కుర్రోళ్లను వేధిస్తున్న ఆర్థరైటిస్.. మోకాళ్లు, భుజం, కీళ్ల నొప్పులకు యోగాతో ఇలా చెక్ పెట్టండి..!

Health Tips : కుర్రోళ్లను వేధిస్తున్న ఆర్థరైటిస్.. మోకాళ్లు, భుజం, కీళ్ల నొప్పులకు యోగాతో ఇలా చెక్ పెట్టండి..!

ఈ మధ్య కాలంలో చాలా మందిని వేధిస్తున్న సమస్య ఆర్థరైటిస్. దీనిని తగ్గించుకోవడానికి యోగాలో ప్రత్యేకమైన ఆసనాలున్నాయంటున్నారు నిపుణులు. ఆర్థరైటిస్ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు యోగా ట్రైనర్ రమ్యకృష్ణ పాస్తాకియాసూచించిన కొన్ని ఆసనాలు.

సేతు బంధనాసనం

యోగా మ్యాట్ పై వెల్లకిలా పడుకోవాలి. తర్వాత రెండు కాళ్లను జోడించి వెనక్కి మడవాలి. పాదాలను పిరుదుల వరకూ తీసుకురావాలి. సపోర్టు కోసం చేతులు నేలకు ఆనించి కాళ్లను పట్టుకోవాలి. తర్వాత మెడ, తలపై బరువు ఉంచి నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పొట్ట, నడుము భాగాలను పైకి లేపాలి. ఇలా ఆసన స్థితిలో కొద్ది సేపు ఉండి నడుమును నేల పైకి దింపాలి.

వీరభద్రాసనం

ముందుగా రెండు కాళ్ల మధ్య మూడున్నర అడుగుల నుంచి నాలుగు అడుగుల గ్యాప్ ఉండేట్లు నిలబడాలి. తర్వాత కుడి కాలిని కుడివైపు తిప్పాలి. ఎడమ పాదాన్ని ఎలాంటి మార్పులేకుండా అదే పోజిషన్లో ఉంచాలి. తర్వాత శ్వాస వదులుతూ కుడి మోకాలిని తొంభై డిగ్రీల వరకు పంచాలి. కానీ మోకాలు పాదాన్ని దాటి ముందుకు రాకుండా చూసుకోవాలి.ఇప్పుడు రెండు చేతులను పైకి తీసుకురావాలి. నడుము, భుజాలు కుడివైపు తిప్పాలి. తర్వాత రెండు చేతులను పూర్తిగా పైకి లేపి జోడించాలి. ఇప్పుడు శరీరాన్ని వెనక్కి స్టైన్ చేయాలి. ఇలా సైస్ చేసేటప్పుడు తల పైకెత్తి చూడాలి.ఇలాగే ఎడమ వైపు కూడా చేయాలి.

దండాసనం

ముందుగా నేల మీద కూర్చోవాలి. వెన్నుని నిటారుగా ఉంచి కాళ్లను ముందుకు చాపాలి. అరచేతులను నేలకు రెండు వైపులా ఆన్చాలి. శరీరం బరువు పిరుదుల పై ఉండేటట్లు చూసుకోవాలి. తొడలను నేలకు ఆన్చాలి. పైకి లేవకుండా ప్రెస్ చేయాలి. తర్వాత కాలి వేళ్లను ముందుకు వెనక్కి సైన్ చేయాలి. పాదాలు పైకి ఉండాలి. అంటే నేలకు తొంభై డిగ్రీల్లో ఉండాలి. ఇప్పుడు చేతులను ఆధారంగా చేసుకొని వెన్నెముక నిటారుగా ఉండేటట్లు ప్రెస్ చేయాలి. ఇలా సాధారణంగా ఊపిరి పీలుస్తూ వదులుతూ ఇదే స్థితిలో ఇరవై నుంచి ముప్పై సెకన్ల పాటు ఉండాలి. మడమలు నేలకు అచ్చాలి..

అధోముఖ స్వనాసనం

ముందుగా చేతులు, మోకాళ్లను నేలకు ఆన్చాలి. తర్వాత మోకాళ్లు పైకి లేపి నడుము భాగాన్ని పైకి లేపాలి. ఆపైన భుజాలను ముందుకు వంచాలి. తర్వాత పాదాలపై బరువు మోపాలి. ఇప్పుడు నేలపై నుంచి మోకాలిని పైకి లేపాలి. పాదం చివరి అంచుపైనే బరువు మోపాలి. తలసు రెండు చేతుల మధ్యలో ఉండేట్లు చూసుకోవాలి. ఇప్పుడు తొడల భాగంలో సాధ్యమైనంత స్టైచ్ చేయాలి. ఆ తర్వాత పూర్వ స్థితికి శరీరాన్ని తీసుకెళ్లాలి.