కెమికల్ గ్యాస్ లీకై ఆరుగురు మృతి

కెమికల్ గ్యాస్ లీకై ఆరుగురు మృతి

గుజరాత్ లో విషాదం చోటు చేసుకుంది. సూరత్ లోని జీఐడీసీ ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీ సమీపంలో గ్యాస్ లీకైంది. ఫ్యాక్టరీ దగ్గర నిలిపి ఉంచిన కెమికల్ ట్యాంకర్ నుంచి విషపూరిత వాయువులు విడుదలయ్యాయి. ఈ వాయువులను పీల్చడంతో ఫ్యాక్టరీలోని ఆరుగురు కూలీలు మృతి చెందగా.. మరో 25 మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. బాధితులను  సమీప ఆస్పత్రికి తరలించారు. కెమికల్ గ్యాస్ లీకేజ్ వల్లే ఈ ఘటన జరిగిందని అధికారులు ధృవీకరించారు.

సచిన్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న డైయింగ్ ఫ్యాక్టరీలో ఈ ఘటన జరిగిందని సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్‌ఛార్జ్, చీఫ్ ఫైర్ ఆఫీసర్ బసంత్ పరీక్ తెలిపారు. ‘తెల్లవారుజామున 4.25 గంటలకు అగ్నిమాపక విభాగానికి ఫోన్ వచ్చింది. ఫ్యాక్టరీ సమీపంలో రోడ్డు పక్కన ఆపి ఉంచిన రసాయన ట్యాంకర్ నుండి గ్యాస్ లీక్ అవడంతో.. దాన్ని పీల్చిన 25 మంది కార్మికులు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వారందరినీ కొత్త సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇప్పటివరకు ఐదుగురు కార్మికులు మరణించారు’ అని చీఫ్ ఫైర్ ఆఫీసర్ తెలిపారు.

For More News..

ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం