ప్రపంచంలో బెస్ట్ ఫుడ్ సిటీస్ లో.. హైదరాబాద్ కు చోటు

ప్రపంచంలో బెస్ట్ ఫుడ్ సిటీస్ లో.. హైదరాబాద్ కు చోటు

ప్రపంచంలోనే.. బెస్ట్ ఫుడ్ సిటీస్.. మంచి టేస్టీ ఆహారం దొరికే నగరాల జాబితాలో హైదరాబాద్ కు చోటు దక్కింది. ప్రపంచ వ్యాప్తంగా టాప్ 100 సిటీస్ తీసుకుంటే.. అందులో ఇండియా నుంచి ఐదు నగరాలు ఉన్నాయి.. ఈ ఐదు నగరాల్లో హైదరాబాద్ సిటీ చోటు దక్కించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా రేటింగ్ తీసుకుంటే హైదరాబాద్ 39వ స్థానంలో ఉంది.. ఇండియా దేశం వరకు తీసుకుంటే.. రెండో స్థానంలో ఉంది.. మొదటి స్థానంలో ముంబై ఉంది. బెస్ట్ ఫుడ్ సిటీస్ ఇన్ వరల్డ్ ఇచ్చిన రేటింగ్.. హైదరాబాద్ ను మరో లెవల్ కు తీసుకెళ్లింది.. హైదరాబాద్ లో చాలా ఫుడ్స్ ఉన్నాయి కదా.. దేని కింద ఈ రేటింగ్ ఇచ్చారో తెలుసా.. బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీకి దక్కింది ఇది..

స్థానిక ఆహారం ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, ట్రావెల్ ఆన్‌లైన్ గైడ్ టేస్ట్ అట్లాస్ ఇటీవల 'ప్రపంచంలోని ఉత్తమ ఆహార నగరాల' జాబితాను విడుదల చేసింది. ఈ లిస్ట్ లో టాప్ 100 కింద ముంబై, హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, లక్నోలు వంటి నగరాలున్నాయి. టాప్ 50లో చోటు దక్కించుకున్న రెండు భారతీయ నగరాలు ముంబై, హైదరాబాద్ లు వరుసగా 35వ, 39వ స్థానంలో ఉన్నాయి. ఢిల్లీ 56వ స్థానంలో ఉండగా, చెన్నై, లక్నో 65, 92 స్థానాల్లో నిలిచాయి. ఢిల్లీ, ముంబైలు పలు రకాల చాట్‌లకు ప్రసిద్ధి చెందినప్పటికీ, హైదరాబాద్ బిర్యానీకి, చెన్నై రుచికరమైన దోసకి, ఇడ్లీలకు ప్రసిద్ధి చెందింది. లక్నో కబాబ్‌లు & బిర్యానీలతో కూడిన ముగ్లాయ్ వంటకాలకు ప్రసిద్ధి చెందింది.

ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న నగరం రోమ్ (ఇటలీ). ఇది అనేక రుచికరమైన వంటకాలకు ప్రసిద్ధి చెందింది. రెండు ఇటాలియన్ నగరాలు బోలోగ్నా, నేపుల్స్ వరుసగా 2వ, 3వ ర్యాంక్‌లను పొందగా.. ఇక్కడ పాస్తా, పిజ్జా, జున్ను ఆధారిత వంటకాలకు ప్రసిద్ధి చెందాయి. టాప్ 10 జాబితాలో చేరిన ఇతర నగరాలు - వియన్నా (ఆస్ట్రియా), టోక్యో (జపాన్), ఒసాకా (జపాన్), హాంకాంగ్ (చైనా), టురిన్ (ఇటలీ), గాజియాంటెప్ (టర్కీ), బాండుంగ్ (ఇండోనేషియా) ఉన్నాయి.