ఐదు జెట్లు కూలినయ్..భారత్–పాక్ ఘర్షణపై ట్రంప్సంచలన కామెంట్స్

ఐదు జెట్లు కూలినయ్..భారత్–పాక్ ఘర్షణపై ట్రంప్సంచలన కామెంట్స్

 

  • భారత్​–పాక్ ​ఘర్షణపై ట్రంప్​సంచలన కామెంట్స్​
  • ఏ దేశ యుద్ధ విమానాలో చెప్పని అమెరికా ప్రెసిడెంట్​

న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి తర్వాత జరిగిన భారత్​–పాకిస్తాన్​ఘర్షణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని తానే ఆపానని గతంలో చెప్పుకొన్న ట్రంప్​.. తాజాగా ఈ యుద్ధంలో 5 ఫైటర్ జెట్స్​ ధ్వంసమయ్యాయని తాజాగా కామెంట్​ చేశారు. వైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రిపబ్లికన్ సెనేటర్లకు ఇచ్చిన విందులో ట్రంప్ మాట్లాడుతూ.. భారత్-పాక్ ఉద్రిక్తతల్లో విమానాలను గాలిలోనే కూల్చేశారని, తన అంచనా ప్రకారం ఐదు ఫైటర్​ జెట్లు కూలిపోయి ఉంటాయని చెప్పారు. అయితే, ఏ వైపు ఈ నష్టం జరిగిందనేది ట్రంప్​ స్పష్టం చేయలేదు.