కౌ సైన్స్‌‌‌‌ ఎగ్జామ్‌‌‌‌కు 5 లక్షల మంది

కౌ సైన్స్‌‌‌‌ ఎగ్జామ్‌‌‌‌కు 5 లక్షల మంది

ఫిబ్రవరి 25న దేశవ్యాప్తంగా పరీక్ష

కోల్‌‌‌‌కతా: ‘కౌ సైన్స్‌‌‌‌’పై గురువారం(ఫిబ్రవరి 25న) దేశవ్యాప్తంగా జరగబోయే పరీక్షను 5 లక్షల కన్నా ఎక్కువమంది రాయబోతున్నారు. ఎగ్జామ్‌‌‌‌కు సంబం ధించి రిజిస్ట్రేషన్‌‌‌‌ను 13 భాషల్లో జనవరి 15 నుంచి ప్రారంభించగా ఇప్పటివరకు 5 లక్షల 10 వేల మంది ఎన్‌‌‌‌రోల్‌‌‌‌ చేసుకున్నారని రాష్ట్రీయ కామధేను ఆయోగ్‌‌‌‌ వెల్లడించింది.  ‘ఇండియా రకం ఆవుల ప్రాముఖ్యం గురించి ప్రజలకు చెప్పాలనుకుంటున్నాం. అందుకే ఎగ్జామ్‌‌‌‌ పెడుతున్నాం. ఇందులో అన్‌‌‌‌సైంటిఫిక్‌‌‌‌ ఏం లేదు’ అని రాష్ట్రీయ కామధేను ఆయోగ్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ వల్లభి కథిరియా చెప్పారు. పరీక్ష రాసిన వారికి సర్టిఫికెట్లను అందిస్తారు. ఎగ్జామ్‌‌‌‌ రాసేలా స్టూడెంట్లను ప్రోత్సహించాలని దేశంలోని 900 వర్సిటీల వీసీలకు యూజీసీ ఇప్పటికే లెటర్లు రాసింది. ఆవుకు సంబంధించిన ఉపయోగాలపై కామధేను ఆయోగ్‌‌‌‌ మెటీరియల్‌‌‌‌ను కూడా విడుదల చేసింది. ఇండియా, రష్యాల్లోని న్యూక్లియర్‌‌‌‌ సెంటర్లలో రేడియేషన్‌‌‌‌ నుంచి రక్షణ కోసం ఆవు పేడను వాడుతున్నారని కామధేను ఆయోగ్‌‌‌‌ రిలీజ్‌‌‌‌ చేసిన మెటీరియల్‌‌‌‌లో పేర్కొన్నారు. గ్యాస్‌‌‌‌ లీక్‌‌‌‌ నుంచి భోపాల్‌‌‌‌ ప్రజలను కూడా కాపాడింది కూడా ఆవుపేడేనని చెప్పారు.