హైదరాబాదీలు బయటకొచ్చి ఓటేయండి.. 3 గంటలకు 5 శాతమే పోలింగ్

హైదరాబాదీలు బయటకొచ్చి ఓటేయండి.. 3 గంటలకు 5 శాతమే పోలింగ్

హైదరాబాద్ విశ్వ నగరంలో పోలింగ్ శాతం మరీ మరీ తక్కువగా నమోదవుతుంది. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం అయితే 10 గంటల వరకు.. అంటే 3 గంటల్లో కేవలం 5 శాతం మాత్రమే నమోదైంది. కొన్ని పోలింగ్ బూతుల్లో తప్పితే.. చాలా పోలింగ్ కేంద్రాల్లో క్యూలు లేవు. నేరుగా వెళ్లి ఓటేసి వచ్చేంత ఖాళీగా ఉన్నాయి. 

హైదరాబాదీలు ప్లీజ్.. బయటకు వచ్చి ఓటేయండి.. ఓటు వేయటం కోసమే సెలవు ఇచ్చింది.. ప్లీజ్ రండి.. ఓటేయండి అంటున్నారు ఎన్నికల అధికారులు. అత్యల్పంగా నాంపల్లిలో 0.5 శాతం పోలింగ్ నమోదు కాగా సనత్ నగర్ లో 1.2 శాతం, కూకట్ పల్లిలో 1.9 శాతం.. మేడ్చల్ లో 2 శాతం.. గోషామహల్ లో 2 శాతం.. చార్మినార్ లో 3 శాతం.. ముషీరాబాద్ లో 4 శాతం.. రాజేంద్రనగర్ లో అత్యధికంగా 15 శాతం పోలింగ్ నమోదైంది.   

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి గ్రేటర్ పరిధిలో ఓటింగ్ శాతం తక్కువగానే నమోదవుతుంటుంది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 54 శాతానికి మించి ఓటింగ్ నమోదు కాలేదు. ఈసారి ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం అధికారులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులు, బహిరంగ ప్రదేశాలు, సర్కిళ్లలో ఓటు హక్కు విలువను తెలియజేస్తూ ప్రచా రాలు నిర్వహించారు.   కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా అవగాహన కల్పించాయి.  ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీస్ పోలింగ్ రోజున టూర్లకు వెళ్లకుండా.. ఓటు వేసేలా వారిని చైతన్యం చేసేందుకు  అధికారులు ఎన్నో కార్యక్రమాలు రూపొందించారు.