కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు 5 వేల నామినేషన్లు

కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు 5 వేల నామినేషన్లు

బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీల నుంచి కలిపి 3,600 మంది అభ్యర్థులు మొత్తం 5,102 నామినేషన్ లు దాఖలు చేశారు. గురువారంతో నామినేషన్​ గడువు ముగిసిపోగా, శుక్రవారం ఎన్నికల సంఘం అధికారులు స్క్రూటినీ ప్రారంభించారు. ఈ నెల 24 వరకూ నామినేషన్ విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ఈ నెల 13న నామినేషన్ ల దాఖలు ప్రారంభం కాగా, బీజేపీ నుంచి 707, కాంగ్రెస్ నుంచి 651, జేడీఎస్ నుంచి 455 నామినేషన్లు దాఖలయ్యాయి. మిగతావి చిన్న పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్లు వేశారు. ఇందులో 3,327 మంది పురుష అభ్యర్థులు  4,710 నామినేషన్లు దాఖలు చేయగా..304 మంది మహిళా అభ్యర్థులు 391 నామినేషన్లు వేశారు. ఒక నామినేషన్​ను ‘అదర్ జెండర్’ అభ్యర్థి దాఖలు చేశారు. ఇక రాష్ట్ర అసెంబ్లీలో 224 సీట్లు ఉండగా, మే 10వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. మే 13వ తేదీన కౌంటింగ్ జరగనుంది.