మాన్సూన్ సీజన్లో ఆరోగ్యానికి 5టిప్స్

మాన్సూన్ సీజన్లో ఆరోగ్యానికి 5టిప్స్

వర్షాకాలంలో వైరల్ ఇన్ఫెక్షన్లు తరుచుగా అటాక్ అవుతాయి. మలేరియా, డెంగ్యూ, ఫ్లూ, చికున్‌గున్యా, లెప్టోస్పిరోసిస్ , దగ్గు, జలుబు, ముక్కు కారటం, జ్వరం ఇలా అనేక వైరల్ ఇన్ఫెక్షన్లు  వస్తుం టాయి. ఇలాంటి సందర్భంతాలో కొన్ని రకాల టిప్స్ మనం వానాకాలంలో కూడా ఆరోగ్యం ఉండటానికి సహాయ పడతాయి. 

1. శుభ్రమైన నీటిని తాగాలి 

వర్షకాలంలో తప్పనిసరిగా శుభ్రమైన, ఫిల్టర్ చేసిన నీరు మాత్రమే తాగాలి. ఈ కాలంలో నీరు ఎక్కువగా కలుషితమై రోగాలను వ్యాప్తి చేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా శుభ్రమైన నీటిని తాగాలి. 

2. వీధుల్లో దొరికే ఆహారపదార్థాలు తినకూడదు

వర్షాకాలంలో వీధుల్లో దొరికే ఆహారం కలుషితం ఉండటం వల్ల వాటిని తినడంతో జీర్ణాశయ సమస్యలు తలెత్తుతాయి.వైరల్ ఇన్ఫెక్షన్లు  వస్తాయి. అలాంటివాటికి దూరంగా ఉంచాలి. రోగనిరోధక శక్తికి వ్యాయామం చేయాలి. సరైన పోషకాహారం, సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా బలోపేతం కావచ్చు.  మీ ప్రేగులు ఎల్లప్పుడూ ఆరోగ్యం ఉండేలా చూసుకోవడం మంచిది. పెరుగు, పెరుగు మొదలైన తగినంత ప్రోబయోటిక్స్ తీసుకోండి. చాలా ప్రోటీన్లు, ఫైబర్ , ఇతర పోషకాలను పొందడానికి మీ ఆహారంలో తాజా కూరగాయలను చేర్చండి. 

3. నీటి నిల్వలు లేకుండా చూడాలి 

మీ ఇంటి చుట్టుపక్కల వర్షపు నీరు నిలిచిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నిల్వ నీరు దోమల వ్యాప్తిని పెంచి డెంగ్యూ, మలేరియా లాంటి రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. 

4. ప్రొబయోటిక్స్ ఎక్కువగా తీసుకోవాలి 

ప్రోబయోటిక్స్ అనేవి గట్ మైక్రోబయోటాను మెరుగుపరుస్తాయి. వీటిని ఉపయోగించినప్పుడు జీర్ణవ్యవస్థ చక్కగా పనిచేస్తుంది. యుగర్ట్, కెఫిర్, బటర్ మిల్క్ వంటి ప్రోబయోటాలను మీ రోజువారీ ఆహారంతోపాటు తీసుకోవాలి. ఇవి ప్రేగు ఆరోగ్యాన్ని , రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. 

5.గొడుగు తప్పనిసరిగా వాడాలి 

మీరు వర్షంలో ఎక్కడికైనా బయటికి వెళ్లినప్పుడు తప్పనిసరిగా గొడుగు వాడాలి. వర్షంలో తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.దీనిద్వారా అనారోగ్యం పాలవకుండా కాపాడుకోవచ్చు.