పాల్వంచలో50 ఎకరాల్లో క్రీడా మైదానం : కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని

పాల్వంచలో50 ఎకరాల్లో క్రీడా మైదానం :  కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని

పాల్వంచ, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని మన్మోహన్ సింగ్ ఎర్త్ యూనివర్సిటీలో 50 ఎకరాల్లో అంతర్జాతీయ క్రీడా మైదానాన్ని నిర్మించనున్నట్లు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. గురువారం పాల్వంచలో రూ.30లక్షలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కొనసాగుతున్నామన్నారు. కేంద్రీయ విశ్వవిద్యాలయం, యంగ్ ఇండియా స్కూల్ నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. 

కొత్తగా చేసే అభివృద్ధి పనులు నాణ్యతతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేశ్‌‌‌‌‌‌‌‌, డిప్యూటీ మేయర్ లలితకుమారి, కమిషనర్ కె.సుజాత, కార్పొరేటర్లు భవిత, సాయిబాబు, శెట్టివిశ్వం, వెంకటేశ్వర్లు, పూర్ణ, శేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు, డిష్ ప్రసాద్ పాల్గొన్నారు.