13 రోజులు.. 5 కోట్ల హిట్స్

13 రోజులు.. 5 కోట్ల హిట్స్
  • గ్లోబల్​గా ఫాస్టెస్ట్​ డౌన్​లోడెడ్​ యాప్​గా ఆరోగ్య సేతు
  • ప్రకటించిన నీతి ఆయోగ్​ సీఈవో అమితాబ్​ కాంత్

న్యూఢిల్లీ: కరోనాపై పోరాటానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరోగ్య సేతు యాప్​ కు జనం నుంచి మస్తు రెస్పాన్స్​ వస్తోంది. ఈ యాప్​ను లాంచ్​ చేసిన 13 రోజుల్లోనే 5 కోట్లకుపైగా హిట్స్​ను సాధించి రికార్డు సాధించింది. కరోనావైరస్ సోకినవారి కదలికలను అబ్జర్వ్ చేసేందుకు, కాంటాక్ట్​ ట్రేసింగ్​ కోసం కేంద్రం ఈ యాప్‌ను ఏప్రిల్​ 2న ప్రారంభించింది. దీని ద్వారా చుట్టు పక్కల ఉన్న కరోనా రోగుల గురించి తెలుసుకోవచ్చు. లాంచ్​ చేసిన మూడు రోజుల్లోనే 50 లక్షల డౌన్​లోడ్లను ఆరోగ్య సేతు సాధించింది. ‘‘టెలిఫోన్​ 5 కోట్ల మందికి చేరడానికి 75 ఏండ్లు పట్టింది. రేడియోకు 38 ఏండ్లు, టీవీకి 13 ఏండ్లు, ఇంటర్నెట్​కు 4 ఏండ్లు, ఫేస్​బుక్​కు 19 నెలలు, పొకేమన్​ గోకు 19 రోజులు పట్టింది. కానీ కరోనాపై పోరాటం కోసం తీసుకొచ్చిన ఇండియా యాప్​ ఆరోగ్య సేతు 13 రోజుల్లోనే 5 కోట్ల యూజర్లను సాధించింది. గ్లోబల్​గా ఈ ఫీట్​ సాధించిన ఫాస్టెస్ట్​ ఎవర్​ యాప్​ ఇదే”అని నీతి ఆయోగ్​ సీఈవో అమితాబ్​ కాంత్​ బుధవారం ప్రకటించారు. మంగళవారం లాక్​డౌన్​ను పొడిగిస్తున్నట్టు ప్రకటించిన ప్రధాని నరేంద్రమోడీ.. ఆరోగ్య సేతు యాప్​ను అందరూ వాడాలని సూచించారు. ఈ నేపథ్యంలో 24 గంటల్లోనే ఈ యాప్​ను కోటి మందికిపైగా డౌన్​లోడ్​ చేసుకున్నారు. ప్రధాని మోడీతోపాటు వివిధ ప్రభుత్వ విభాగాలు, ఎడ్యుకేషనల్​ బోర్డ్స్ ఈ యాప్​ను ప్రమోట్​ చేస్తున్నాయి. ఆరోగ్య సేతు యాప్​ను ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఫోన్లలో దీనిని డౌన్​లోడ్​ చేసుకోవచ్చు. హిందీ, ఇంగ్లిష్​ సహా పలు ఇండియన్​ లాంగ్వేజెస్​లో ఇది అందుబాటులో ఉంది. స్మార్ట్‌ఫోన్‌ లొకేషన్ ఆధారంగా కరోనా సోకిన వారు సమీపంలో ఉన్నారా అనేది తెలుసుకోవచ్చు. ఇందుకోసం యూజర్లు బ్లూటూత్.. లొకేషన్​ యాక్సెస్​ ఇవ్వాల్సి ఉంటుంది. కరోనా వైరస్​కు సంబంధించిన కొన్ని ప్రశ్నలకు యూజర్లు జవాబు ఇవ్వాల్సి ఉంటుంది.