దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న కరోనా 

దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న కరోనా 

ఢిల్లీ : దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైరస్ కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఢిల్లీ, ముంబైలో పరిస్థితి దారుణంగా మారుతోంది. అక్కడ 10వేలకు పైగా రోజువారీ కేసులు నమోదవుతున్నాయి.

  • మహారాష్ట్రలో ఇవాళ కొత్తగా 26,538 మంది కరోనా బారినపడ్డారు. వారిలో 15,166 మంది ముంబైకి చెందిన వారే ఉన్నారు. ఆ రాష్ట్రంలో గత 24 గంటల్లో కరోనా కారణంగా 8 మంది చనిపోయారు. మృతుల్లో ముగ్గురు ముంబైకి చెందినవారు ఉన్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో యాక్టివ్ కేసుల సంఖ్య 87,505గా ఉంది. 
  • దేశ రాజధాని ఢిల్లీలోనూ కరోనా విలయం సృష్టిస్తోంది. మంగళవారం 5,481 మంది కరోనా బారిన పడగా.. బుధవారం మరో 10,665 మందికి వైరస్ అంటుకుంది. మే 12 తర్వాత ఇంత భారీ సంఖ్యలో కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. ఢిల్లీలో గత 24 గంటల్లో 8 మంది చనిపోయారు. ప్రస్తుతం అక్కడ పాజిటివిటీ రేటు 11.88శాతంగా ఉంది. 
  • గుజరాత్లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఆ రాష్ట్రంలో కొత్తగా 3,350 మందికి కరోనా నిర్థారణ కాగా.. వారిలో 50 మంది ఒమిక్రాన్ సోకినవారు ఉన్నారు. వైరస్ బారినపడ్డ వారిలో ఒకరు మృత్యువాతపడగా.. 236మంది కోలుకున్నారు. ప్రస్తుతం గుజరాత్ లో 10వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
  • బెంగాల్లో గత 24 గంటల్లో 14,022 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. ఆ రాష్ట్రంలో ఇవాళ అత్యధికంగా 17 మంది కరోనా కారణంగా చనిపోయారు. ప్రస్తుతం బెంగాల్లో 33,042 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
  • కర్నాటకలో 4,246 మంది కొత్తగా కరోనా బారిన పడగా.. ఇద్దరు మృత్యువాతపడ్డారు. 
  • హిమాచల్ ప్రదేశ్లో కొత్తగా 374 కరోనా పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయి. 15 మంది వైరస్ బారి నుంచి కోలుకోగా ఒకరు చనిపోయారు.
  • జమ్మూ కాశ్మీర్ లో గడిచిన 24 గంటల్లో 418 మందికి కరోనా వైరస్ సోకింది. జమ్మూలో 311 మంది, కాశ్మీర్ లో 140 మందికి పాజిటివ్ నిర్థారణ అయింది. ప్రస్తుతం అక్కడ 1819 యాక్టివ్ కేసులున్నాయి.

మరిన్ని వార్తల కోసం..

రాష్ట్రంలో భారీగా పెరిగిన కరోనా కేసులు

కరీంనగర్ జైలు నుంచి బండి సంజయ్ రిలీజ్