
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితుడు అభిషేక్ బోయినపల్లి బెయిల్ పిటిషన్ ను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. అడిషనల్ సోలిసిటరీ జనరల్ వాదనలకు సిద్ధంగా లేకపోవడంతో కేసు విచారణను వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం ప్రకటించింది. తదుపరి విచారణను జనవరి 29, 2024కి వాయిదా వేసింది. కేసు విచారణ బెయిల్ మంజూరు ఆలస్యం పై న్యాయవాది ముకుల్ రోహత్గి అసహనం వ్యక్తం చేశారు.
కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ తనను అక్రమంగా అరెస్టు చేసిందని తనకు బెయిల్ ఇవ్వాలని అభిషేక్ సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. 6 నెలలుగా అభిషేక్ బోయినపల్లి తీహార్ జైలులో ఉన్నారు. ఇప్పటికే ఆయన బెయిల్ పిటీషన్ ను పలుమార్లు వాయిదా పడింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ 50 వేల పేజీలతో ఆరు ఛార్జ్ షీట్లు చేసింది. 50 మంది నిందితులు, 400 మందికి పైగా సాక్షులను విచారించారు.