ఇంటర్‌‌‌‌ స్కూల్‌‌‌‌ టోర్నీలో సంచలనం

ఇంటర్‌‌‌‌ స్కూల్‌‌‌‌ టోర్నీలో సంచలనం

నాగ్‌‌‌‌పూర్‌‌‌‌: మహారాష్ట్ర జూనియర్‌‌‌‌ ఇంటర్‌‌‌‌ స్కూల్‌‌‌‌ అండర్‌‌‌‌–14 టోర్నీలో మరో సంచలనం. సరస్వతి విద్యాలయకు చెందిన 13 ఏళ్ల మహారాష్ట్ర యంగ్‌‌‌‌ క్రికెటర్‌‌‌‌ యష్‌‌‌‌ చౌడే.. 40 ఓవర్ల మ్యాచ్‌‌‌‌లో అజేయంగా 508 రన్స్‌‌‌‌ (178 బాల్స్‌‌‌‌లో 81 ఫోర్లు, 18 సిక్సర్లు) చేశాడు. దీంతో సిద్ధేశ్వర్‌‌‌‌ విద్యాలయతో జరిగిన ఈ మ్యాచ్‌‌‌‌లో సరస్వతి జట్టు 714/0 స్కోరు చేసింది. యష్‌‌‌‌తో పాటు తిలక్‌‌‌‌ వకోడే (127) సెంచరీతో చెలరేగాడు. ఓవరాల్‌‌‌‌గా లిమిటెడ్‌‌‌‌ ఓవర్స్‌‌‌‌ క్రికెట్‌‌‌‌లో చరిత్‌‌‌‌ సెలెపెరుమా (553*  శ్రీలంక) తర్వాత హయ్యెస్ట్‌‌‌‌ స్కోరు చేసిన రెండో బ్యాటర్‌‌‌‌గా చౌడే రికార్డులకెక్కాడు. అన్ని ఫార్మాట్ల ఏజ్‌‌‌‌ గ్రూప్‌‌‌‌ టోర్నీలను పరిగణనలోకి తీసుకుంటే 500 ప్లస్‌‌‌‌ స్కోరు చేసిన పదో బ్యాటర్‌‌‌‌గా రికార్డు సృష్టించాడు. ఇండియా తరఫున ఐదో బ్యాటర్‌‌‌‌. ప్రణవ్‌‌‌‌ ధన్వాడే (1009*), ప్రియాన్షు మోలియా (556*), పృథ్వీ షా (546), డ్యాడీ హ్యావ్‌‌‌‌వాలా (515) ముందున్నారు. తర్వాత  సిద్ధేశ్వర్‌‌‌‌ టీమ్​ 9 రన్స్​కే ఆలౌటైంది.