ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

పటాన్ చెరు, వెలుగు : రాష్ట్రంలో అమలవుతున్న ప్రతి సంక్షేమ పథకంలో కేంద్ర ప్రభుత్వం వాటా ఇస్తోందని, కానీ తెలంగాణలో టీఆర్​ఎస్​ పాలన మాత్రం సొమ్ము కేంద్రానిది.. సోకు రాష్ట్రానిది అన్నట్టుగా కొనసాగుతోందని హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈటల సమక్షంలో దాదాపు 500 మంది యువజన నాయకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఈటల మాట్లాడారు. హుజూరాబాద్ ఎన్నికల టైంలో దళిత బంధు పేరుతో మోసం చేయగా,  ఇప్పుడు మునుగోడు బై ఎలక్షన్ ను దృష్టిలో పెట్టుకొని సెక్రటేరియట్ కు అంబేద్కర్ పేరు పెట్టి దళిత వర్గాలను సీఎం మరోసారి మోసం చేస్తున్నారని ఆరోపించారు. పెద్ద భూస్వాములకు ఇస్తున్న రైతు బంధు పథకాన్ని కౌలు రైతులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.

దళితులకు మూడెకరాలు ఎక్కడ ఇచ్చారని నిలదీశారు. రింగ్ రోడ్డు పక్కన భూములను లాక్కొని రియల్  ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ను  ఓడిస్తేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ పటాన్ చెరు ఎమ్మెల్యే అవినీతిలో కూరుకుపోయారని, భూకబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేకు త్వరలో ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. నియోజకవర్గంలో బీజేపీకి అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు లభిస్తోందన్నారు. సభలో  ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు మాధురి, గోదావరి అంజిరెడ్డి,  బీజేపీ నాయకులు చింత యాదగిరి, శ్రీకాంత్ గౌడ్, ఈశ్వర్, శ్రీనివాస్ గుప్తా, ఈశ్వర్, రవీందర్, మన్నే శ్రీకాంత్, నర్సింగ్ గౌడ్, రాజశేఖర్, శంకర్, ఆగరెడ్డి, భరత్ చారి పాల్గొన్నారు.

ప్రజా సమస్యలే బీజేపీ ఎజెండా

నారాయణ్ ఖేడ్, వెలుగు : ప్రజా సమస్యలే బీజేపీ ఎజెండా అని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ అన్నారు. ‘ప్రజా గోస బీజేపీ భరోసా’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం నారాయణఖేడ్ నియోజకవర్గంలోని సిర్గాపూర్ మండలం వంగ్దల్, వాసర్, గరిడే గావ్, చీమలపాడు, సిర్గాపూర్ నల్లవాగు గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే విజయ పాల్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప, బీజేపీ పార్లమెంట్ ఇన్​చార్జి రవికుమార్ గౌడ్, జిల్లా ఇన్​చార్జి నరేందర్ తో కలిసి జెండా ఆవిష్కరించి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  డబుల్ ఇంజన్ సర్కార్ తోనే డెవలప్​మెంట్ జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రతి గ్రామంలో పాఠశాల, దవాఖానా కట్టలేదు కానీ, గల్లీకో బెల్ట్ షాప్ పెట్టి ప్రజల సంపాదన దోచుకుంటున్నారని మండిపడ్డారు.  కేంద్ర ప్రభుత్వం వ్యవసాయం కోసం యూరియా, డీఏపీ బస్తాలపై సబ్సిడీ ఇస్తోందని తెలిపారు.  వరి కొనుగోలుకు సంబంధించి ప్రతి పైసా లెక్కగట్టి రాష్ట్ర  ప్రభుత్వానికి ఇస్తుందని చెప్పారు. కానీ తెలంగాణ సర్కార్  కేంద్రాన్ని బద్నాం చేయాలని చూస్తోందన్నారు. ఇసుక దందా నుంచి మొదలు పెడితే  కాళేశ్వరం ప్రాజెక్టు, లిక్కర్ ఇలా అన్ని స్కాంల్లో కేసీఆర్ కుటుంబ సభ్యులే ఉన్నారని ఆరోపించారు. కార్యక్రమంలో బీజేవైఎం ఉపాధ్యక్షుడు  విజయ్ షెట్కార్, అసెంబ్లీ కన్వీనర్ రవికుమార్ ముదిరాజ్, జనరల్ సెక్రటరీ మటం శివకుమార్, బీజేపీ నాయకులు మారుతిరెడ్డి, రామకృష్ణ,  రజనీకాంత్, సంజు పాటిల్, రాజు గౌడ్, ఈశ్వర్ పాల్గొన్నారు. 

సేవా పక్షం కార్యక్రమం..

పటాన్​చెరు, వెలుగు :  ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని పటాన్ చెరు మండల పరిధిలోని ఇస్నాపూర్ చౌరస్తా లో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఆదివారం సేవా పక్షం కార్యక్రమంలో భాగంగా ఉచిత వైద్యం, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య​అతిథులుగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ, సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి,  ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్ హాజరయ్యారు.  రక్తదానం చేసినవారిని అభినందించారు.

సీఎం కేసీఆర్ చదివింది ఎంఐఎం స్క్రిప్టు

మెదక్​ టౌన్, వెలుగు : సీఎం కేసీఆర్ ​జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలలో ఎంఐఎం రాసిచ్చిన స్క్రిప్టును చదివారని బీజేపీ మెదక్ ​జిల్లా ప్రెసిడెంట్​గడ్డం శ్రీనివాస్​ ఆరోపించారు. ఊచకోత కోసి, మహిళలను చెరిపిన నిజాంను పొగడడం తెలంగాణ విమోచన వీరులను అవమానపర్చడమేనన్నారు. సెప్టెంబర్​ 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్​ వ్యవహరించిన తీరుకు నిరసనగా ఆదివారం బీజేపీ జిల్లా ఆఫీసులో  నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాస్​మాట్లాడుతూ సీఎం రాష్ట్ర విమోచన దినోత్సవాన్ని, జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుతూ తెలంగాణ వీరులను కనీసం స్మరించుకోకపోవడం అమానుషమన్నారు. ఎంఐఎం పార్టీ తొత్తుగా వ్యవహరిస్తూ  వారు  ఇచ్చిన  స్క్రిప్ట్  అనుసరించడం సిగ్గుచేటని, వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్​ చేశారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ విమోచనాన్ని  కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ వీరుల పోరాటాలు, వారి త్యాగాలను స్మరించుకుందని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ  రాష్ట్ర నాయకులు జనార్దన్ రెడ్డి, జిల్లా  జనరల్ ​సెక్రటరీ నల్లాల విజయ్​కుమార్​, బీజేవైఎం జిల్లా ప్రెసిడెంట్​ఉదయ్ కిరణ్,  నాయకులు నాయిని ప్రసాద్, మధు, జనార్దన్, లక్ష్మీనర్సింహారెడ్డి,  ప్రభాకర్,  సతీష్ నర్సింలు, నాగరాజు,  మల్లేశ్  పాల్గొన్నారు. 

నల్లబ్యాడ్జీలతో నిరసన

సంగారెడ్డి టౌన్, వెలుగు : సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో త్యాగ మూర్తులను స్మరించకోకుండా, నిజాంను ఒక్కమాట అనకుండా ఎంఐఎంకు తల వంచాడని ఆదివారం బీజేపీ నాయకులు సంగారెడ్డి పట్టణశాఖ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కౌన్సిలర్ నాయి కోటి రమేశ్, పట్టణ ఉపాధ్యక్షుడు నగరం సంతోష్.   పట్టణ నాయకులు ఈశ్వర్ రెడ్డి, స్వర్ణలత, విక్రమ్ శంకర్, సందీప్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

ఉత్సాహంగా సమైక్యతా వజ్రోత్సవాలు

మెదక్​ టౌన్/సంగారెడ్డి టౌన్/సిద్దిపేట రూరల్, వెలుగు : తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ఉత్సాహంగా కొనసాగాయి. ముగింపు ఉత్సవాలలో భాగంగా ఆదివారం మెదక్​ పట్టణంలోని ద్వారకా గార్డెన్స్​లో సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్​రెడ్డి, మదన్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, విద్యార్థులతో కలసి  పిల్లలతో ఆడిపాడి ఉత్సాహాన్ని నింపారు. సంగారెడ్డి కలెక్టరేట్ ఆడిటోరియంలో కలెక్టర్ డాక్టర్ శరత్, జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ, ఎస్పీ రమణ కుమార్, హ్యాండ్లూమ్ చైర్మన్ చింత ప్రభాకర్, అడిషనల్​ కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. సిద్దిపేట పట్టణంలోని కోమటి చెరువు మినీ ట్యాంక్ బండ్ రూబీ నెక్లెస్ రోడ్ పై సిద్దిపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంబరాలకు జడ్పీ చైర్ పర్సన్ రోజా శర్మ, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు.  సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన స్వాతంత్ర సమరయోధులకు, కళాకారులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు  పోతారాజుల వేషధారణలతో, బతుకమ్మ, బోనాలు పాటలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో అందరిని ఆకట్టుకున్నారు. 

తూప్రాన్​ మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలు

తూప్రాన్, వెలుగు : మెదక్ జిల్లా  తూప్రాన్​ మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. 9వ వార్డులోని గీతారెడ్డికాలనీలో ప్రభుత్వ భూమిలో అధికార పార్టీకి చెందిన ఓ ప్రజా ప్రతినిధి పెద్ద బిల్డింగ్ నిర్మిస్తున్నాడని ఆఫీసర్లకు ఫిర్యదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూముల్లో  అక్రమంగా నిర్మాణాలు జరుగుతున్నా ఆఫీసర్లు చూసీచూడనట్లు వ్యవహరించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయమై తూప్రాన్  ఎమ్మార్వోను వివరణ కోరగా అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తామని తెలిపారు. కమిషనర్ మోహన్ మాట్లాడుతూ ఆ ప్రతినిధి నిర్మిస్తున్న ఇంటికి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, వెంటనే పనులను నిలిపివేయిస్తామని చెప్పారు. 

విద్యార్థులు లక్ష్యసాధనకు కృషి చేయాలి

మెదక్​ టౌన్, వెలుగు :  విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకొని దానిని సాధించేందుకు పట్టుదలతో కృషి చేయాలని మున్నూరుకాపు మహాసభ ఎడ్యుకేషన్​ ట్రస్టు బోర్డు బాధ్యులు శ్రీధర్, విక్రమ్​ అన్నారు. ఆదివారం మహాసభ ఆధ్వర్యంలో మెదక్​ పట్టణంలోని పిట్లంబేస్​లోని మున్నూరుకాపు సంఘ భవనంలో వంద మందికిపైగా విద్యార్థులకు ఉచితంగా నోటు బుక్కులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్​లోని కాచిగూడ మున్నూరుకాపు మహాసభ ఆధ్వర్యంలోని ఎడ్యుకేషన్​ ట్రస్టు ద్వారా  నిరుపేదలైన 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఏటా ఉచితంగా నోటు బుక్కులను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర మున్నూరు కాపు సంఘం నాయకుడు బెండల నాగభూషణ,  మెదక్​ మున్నూరు కాపు సంఘం నాయకులు కొత్త దశరథం, బండ సిద్ధయ్య, కొంగోటి గట్టేశ్,  యువక మండలి నాయకులు ఎం. వీర్​కుమార్​, బండ నరేశ్,  కొంగోటి శ్రీనివాస్​, సంగాయిపేట నర్సింలు, ఆకారం యాదగిరి పాల్గొన్నారు.

ఉద్యోగ భద్రత కల్పించాలి

సిద్దిపేట రూరల్, వెలుగు : కారోబార్లను పంచాయతీ సెక్రటరీ లకు అసిస్టెంట్లుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని కారోబార్ల సంఘం జిల్లా అధ్యక్షుడు కనకయ్య ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం రాష్ట్ర యూనియన్ ప్రధాన కార్యదర్శి  చింగి గణేశ్​ఆధర్యంలో సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో కారోబార్ల జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కొత్త జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన మాట్లాడుతూ  గ్రామ పంచాయతీల్లో కారోబార్లను అన్ని విధాలుగా పని చేయించుకుంటున్నారని, ఈ మల్టీ పర్పస్ విధానాన్ని తొలిగించాలని కోరారు. కాగా కొత్తగా ఎన్నుకున్నవారిలో  ప్రధాన కార్యదర్శిగా లింగాల బాబు, గౌరవ అధ్యక్షునిగా పిట్టల ఆశయ్య, ఉపాధ్యక్షులు గట్టాడు శంకర్, పబ్బతి స్వామి ఎన్నికయ్యారు. 

చెట్లు నరికి రోడ్డేసినోళ్లపై చర్యలు తీసుకోవాలి

మెదక్ (కౌడిపల్లి), వెలుగు: కౌడిపల్లి మండలం హరిచంద్​ తండా పరిధిలో అడవిలో అక్రమంగా చెట్లను నరికి రోడ్డు వేసినవారిపై ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రాజేందర్, నాయకులు రఘువీరారెడ్డి, రాకేశ్ ​డిమాండ్​ చేశారు.  ఆదివారం చెట్లు నకిన ప్రాంతాన్ని వారు పరిశీలించారు. ప్రభుత్వం హరితహారం పేరుతో మొక్కలు నాటితే, కొందరు రియల్టర్లు సొంత ప్రయోజనాల కోసం యథేచ్ఛగా వాటిని నరికివేయడం దారుణమన్నారు. ఈ విషయమై స్థానికులు ఫిర్యాదు చేస్తే ఫారెస్టు ఆఫీసర్లు వచ్చి కేవలం రోడ్డు బంద్​ చేసి వెళ్లారన్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి నిందితులపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఫారెస్ట్​ రేంజ్ ఆఫీస్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు.