తెలంగాణలో 13 వేల 689 కరోనా టెస్టులు చేస్తే..ఎన్ని కేసులంటే
V6 Velugu Posted on May 13, 2022
హైదరాబాద్ : భారతదేశంలో కరోనాకు ఇంకా చెక్ పడడం లేదు. గతంలో కన్నా.. కొద్దిగా తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతుండడంతో ఊపిరిపీల్చుకొనే అంశం. మరణాల సంఖ్య తక్కువగా, రికవరీల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో సైతం కరోనా పాజిటివ్ కేసులు ఇంకా రికార్డవుతున్నాయి. తెలంగాణలో గత 24 గంటల్లో 52 కేసులు నమోదయినట్లు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. 36 మంది ఆరోగ్యవంతులయ్యారని.. ఇప్పటి వరకు కరోనా వైరస్ నుంచి 7, 87, 997 మంది కోలుకున్నారని పేర్కొంది. గత 24 గంటల్లో కరోనా నుంచి ఎవరూ చనిపోలేదని, మరణాల సంఖ్య 4 వేల 111గా ఉందని తెలిపింది. రికవరీ రేటు 99.43 శాతంగా ఉందని, మొత్తం 13 వేల 689 టెస్టులు నిర్వహించడం జరిగిందని పేర్కొంది.
ఏ జిల్లాలో ఎన్ని కేసులు :
ఆదిలాబాద్ 01, భద్రాద్రి కొత్తగూడెం 0, హైదరాబాద్ లో 34, జగిత్యాల 00, జనగాం 00, జయశంకర్ భూపాలపల్లి 00, జోగులాంబ గద్వాల 01, కామారెడ్డి 00, కరీంనగర్ 01, ఖమ్మం 00, కొమరంభీం ఆసిఫాబాద్ 00, మహబూబ్ నగర్ 00, మహబూబాబాద్ 00, మంచిర్యాల 02, మెదక్ 00, మేడ్చల్ మల్కాజ్ గిరి 04, ములుగు 00, నాగర్ కర్నూలు 00, నల్గొండ 01, నారాయణపేట 00, నిర్మల్ 02, నిజామాబాద్ 01, పెద్దపల్లి 00, రాజన్న సిరిసిల్ల 00, రంగారెడ్డి 02, సంగారెడ్డి 01, సిద్ధిపేట 00, సూర్యాపేట 00, వికారబాద్ 00, వనపర్తి 00, వరంగల్ రూరల్ 01, హన్మకొండ 01, యాదాద్రి భువనగరి 00. మొత్తం - 52
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
— IPRDepartment (@IPRTelangana) May 13, 2022
(Dated.13.05.2022 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/BPHWqCxfTh
మరిన్ని వార్తల కోసం :
పోటీ పరీక్షల ప్రిపరేషన్ కు స్టైపెండ్ ఇవ్వాలె
బండి సంజయ్‌కి మంత్రి కేటీఆర్ నోటీసులు.. ఆధారాలుంటే బయటపెట్టాలి
Tagged telangana corona cases, , India Covid Cases, Telangana Corona Vaccine, Telangana New Corona Cases, Telangana Logs New Covid 19 Cases, Telangna Covid Died Cases