ఆరంగ్రేట మ్యాచ్‌లోనే అరుదైన రికార్డు.. ఒక ఓవర్‌లో 52 పరుగులు

ఆరంగ్రేట మ్యాచ్‌లోనే అరుదైన రికార్డు.. ఒక ఓవర్‌లో 52 పరుగులు

అర్జెంటీనా, చిలీ మహిళా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. రికార్డుల ఊచకోత ఎలా ఉంటుందో ఈ మ్యాచ్ స్కోర్ కార్డు చూస్తే అర్థమవుతుంది. కలలో కూడా ఊహించని రికార్డులు నమోదయ్యాయి. తొలుత బ్యాటింగ్ చేసిన అర్జెంటీనా ఏకంగా 427 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో చిలీ 63 పరుగులకే కుప్పకూలింది. పోనీ ఇది గల్లీ మ్యాచ్ అనుకుంటే పొరపాటు..  ఇదొక అంతర్జాతీయ టీ20 మ్యాచ్. 

ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా మహిళా క్రికెటర్లు లూసియా టేలర్‌ (169; 27 ఫోర్లు), అల్బెర్టీనా గలాన్‌ (145 నాటౌట్; 23 ఫోర్లు) భారీసెంచరీలు బాదారు. ఓ అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో ఇద్దరు బ్యాటర్లు సెంచరీలు చేయడం ఇదే తొలిసారి. వీరిద్దరూ ఇన్ని పరుగులు చేసినా.. ఇన్నింగ్స్ మొత్తంలో ఒక్క సిక్స్ కూడా ఈ మ్యాచ్ ప్రత్యేకత. తాజాగా వెలుగులోకి వచ్చిన విషయమేమిటంటే.. ఈ  మ్యాచ్‌లో చిలీ తరుపున చిలీ తరఫున అరంగేట్రం చేసిన ఫ్లోరెన్సియా మార్టినెజ్ ఒక ఓవర్‌లో 52 పరుగులు సమర్పించుకుందట. చెత్త రికార్డు అయినా.. తొలి మ్యాచ్‌లోనే అది తన వశం కావడంతో తెగ సంబరపడిపోతోందట.

ఈ మ్యాచ్ ప్రత్యేకతలు 

  • అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో అత్యధిక స్కోర్: 427
  • ఓ అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో ఇద్దరు బ్యాటర్లు సెంచరీలు చేయడం. 
  • 427 పరుగులు చేసినా.. ఒక్క సిక్స్ కూడా లేకపోవడం. 
  • ఒక ఓవర్ లో 52 పరుగులు.
  • మొత్తం 73 ఎక్స్‌ట్రాలు.. అందులో 64 నో బాల్స్‌.
  • అర్జెంటీనా జట్టు 364 పరుగుల తేడాతో విజయం.