నేటి నుంచి మైన్స్​ రెస్క్యూ పోటీలు

నేటి నుంచి మైన్స్​ రెస్క్యూ పోటీలు

యైటింక్లయిన్‌‌ కాలనీ, వెలుగు: సింగరేణి రామగుండం రీజియన్‌‌ పరిధిలోని ఆర్జీ–2 డివిజన్‌‌ యైటింక్లయిన్‌ ‌కాలనీలో సోమవారం నుంచి ఐదు రోజుల పాటు జరగనున్న 52వ ఆల్‌‌ ఇండియా మైన్స్‌‌ రెస్క్యూ పోటీలకు సంస్థ ఏర్పాట్లు చేసింది. వివిధ రాష్ట్రాలకు చెందిన మైన్స్‌‌, మెటల్‌‌ కంపెనీలకు చెందిన 25 జట్ల బ్రిగ్రేడియర్లు ఆదివారం రెస్క్యూ స్టేషన్‌‌కు చేరుకున్నారు.

సింగరేణి మేనేజ్‌‌మెంట్‌ వారికి ఘన స్వాగతం పలికింది. ఆదివారం ఆర్‌‌ఆర్‌‌సీ భవన్‌‌లో డైరెక్టర్‌‌ఆఫ్‌‌ మైన్స్‌‌ సేప్టీ, చీఫ్‌ జడ్జ్(ధన్‌‌బాద్‌‌) పాల్గొని వివరాలు వెల్లడించారు. పాటీల్లో వివిధ కంపెనీల నుంచి 175 మంది సభ్యులు పాల్గొంటున్నారని, ఈ సారి హిందుస్తాన్‌‌ జింక్‌‌ లిమిటెడ్‌‌ సంస్థ నుంచి మహిళా జట్టు సభ్యులు వచ్చారని ఆయన తెలిపారు.