
గచ్చిబౌలి, వెలుగు: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 6 నుంచి 11 వరకు చేపట్టిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 534 మంది పట్టుబడ్డారు. ఇందులో 435 మంది బైకర్లు, 18 మంది ఆటో డ్రైవర్లు, 79 మంది కారు డ్రైవర్లు, ఇద్దరు లారీ డ్రైవర్లు ఉన్నారు.
వీరందరిపై 105 సెక్షన్ కింద కేసులు నమోదు చేసినట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. 32 మందికి న్యాయస్థానం జైలుశిక్ష విధించింది. 35 మంది డ్రింకర్లను సోషల్ సర్వీస్ చేయాలని ఆదేశించింది.