హిట్లర్ వాడిన పెన్సిల్​కు వేలంలో 5.5 లక్షల ధర

హిట్లర్ వాడిన పెన్సిల్​కు వేలంలో 5.5 లక్షల ధర

బెల్ ఫాస్ట్: జర్మనీ దివంగత నియంత అడాల్ఫ్  హిట్లర్​కు చెందిన పెన్సిల్  వేలంలో రూ.5.5 లక్షలకు అమ్ముడుపోయింది. అంతకుముందు ఈ పెన్సిల్ రూ.50 లక్షలకు అమ్ముడవుతుందని భావించారు. కానీ, అంచనా వేసిన విలువలో పదో వంతు మాత్రమే పలికింది.  పురాతన వస్తువులను వేలం వేసే బ్లూమ్ ఫీల్డ్  సంస్థ బెల్​ఫాస్ట్​లో మంగళవారం ఈ వేలంపాట కార్యక్రమాన్ని నిర్వహించింది. 1941 ఏప్రిల్ 20న హిట్లర్  పుట్టిన రోజు సందర్భంగా ఆయన లవర్ ఇవా బ్రౌన్ ఈ పెన్సిల్​ను గిఫ్ట్ గా ఇచ్చింది. దానిపై ‘ఏహెచ్’ (అడాల్ఫ్  హిట్లర్) అని చెక్కి ఉంది. వాస్తవానికి ఈ పెన్సిల్​ను 2002లో ఓ కలెక్టర్  కొన్నాడు. పెన్సిల్​తో పాటు నాజీ జర్మనీకి చెందిన మరికొన్ని వస్తువులను కూడా వేలం వేశారు. ఈ వేలంపాటపై యూరోపియన్ యూదుల అసోసియేషన్ చైర్మన్ రబ్బీ మెనకం అభ్యంతరం వ్యక్తంచేశారు. హిట్లర్   దురగాతాలకు బలైన వారిని అవమానించడమే అని రబ్బీ వర్ణించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులకూ బ్లూమ్ ఫీల్డ్ వేలంపాట అవమానకరమని పేర్కొన్నారు.