అమెరికా బెదిరించినా.. రష్యా ఆయిలే కొనాలి

అమెరికా బెదిరించినా.. రష్యా ఆయిలే కొనాలి
  • ప్రభుత్వానికి జీటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ సలహా

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా నుంచి చమురు (క్రూడాయిల్‌‌‌‌‌‌‌‌) కొనుగోలు చేసే దేశాలపై 100  శాతం టారిఫ్‌‌‌‌‌‌‌‌లు విధిస్తామని బెదిరించినా,  ఇండియా మాత్రం రష్యా నుంచి చమురు కొనుగోలును కొనసాగించాలని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ ) ప్రభుత్వానికి సలహా ఇచ్చింది. 

ఈ సంస్థ ఫౌండర్ అజయ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, రష్యా నుంచి డిస్కౌంట్‌‌‌‌‌‌‌‌తో కొనుగోలు చేసిన చమురు భారత్‌‌‌‌‌‌‌‌లో ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌‌‌‌‌ను నియంత్రించడంలో సాయపడిందని అన్నారు. దీంతో గ్లోబల్‌‌‌‌‌‌‌‌ ఆర్థిక వ్యవస్థ గందరగోళంగా ఉన్నా,  ఇండియా స్థిరంగా నిలబడగలిగిందని పేర్కొన్నారు. 

ఇప్పుడు తలొగ్గినా, అమెరికా బెదిరింపులు ఆగవని, మరిన్ని డిమాండ్లు చేయొచ్చని ఆయన హెచ్చరించారు. ట్రంప్ తరచూ వివిధ కారణాలతో టారిఫ్‌‌‌‌‌‌‌‌లు వేస్తామని బెదిరిస్తున్నారు. ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కూడా వివిధ డిమాండ్లు చేయొచ్చని, ఒప్పుకోకపోతే టారిఫ్ వేస్తామని బెదిరించొచ్చని శ్రీవాస్తవ అన్నారు.   అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం వలన ట్రంప్ వైఖరి మారకపోవచ్చని అభిప్రాయపడ్డారు.