క్యూబాకు ఆయిల్ అమ్మితే టారిఫ్‌‌ విధిస్త: ప్రపంచ దేశాలకు ట్రంప్ హెచ్చరిక

క్యూబాకు ఆయిల్ అమ్మితే టారిఫ్‌‌ విధిస్త: ప్రపంచ దేశాలకు ట్రంప్ హెచ్చరిక

వాషింగ్టన్: క్యూబాకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ దేశానికి చమురు విక్రయించే లేదా సరఫరా చేసే దేశాలపై భారీ టారిఫ్‌‌లు విధిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌‌ సంతకం చేశారు. ఈ తాజా ఆంక్షలు శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి. 

అమెరికా జాతీయ భద్రతకు, విదేశాంగ విధానానికి క్యూబా ప్రభుత్వం తీవ్రమైన ముప్పుగా మారిందని ట్రంప్ తెలిపారు. రష్యా, చైనా, ఇరాన్ వంటి శత్రు దేశాలు, హమాస్, హిజ్బుల్లా వంటి సమూహాలకు మద్దతు ఇస్తోందని ఆరోపించారు. అందువల్ల ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ కింద క్యూబా విషయంలో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.