మసీదు ముందు ఎలుకల్ని వదులుతూ.. వ్యక్తి అరెస్ట్, 18 వారాలు నిషేధం..

మసీదు ముందు ఎలుకల్ని వదులుతూ.. వ్యక్తి అరెస్ట్, 18 వారాలు నిషేధం..

రోడ్డుపై చేత వేసే వాళ్ళని చూసుంటాం.. ఎక్కడపడితే అక్కడ ఉమ్మి వేసేవాళ్ళని చూసుంటాం.. రోడ్ల పై ఎలుకల్ని వదిలేవాళ్ళని చూసారా.. ఇది మీకు ఏంటి అని అనిపించినా నిజంగా జరిగిన ఒక సంఘటన.. యుకెలోని షెఫీల్డ్‌ మసీదు ముందు జాత్యహంకార నినాదాలు చేస్తూ ఎలుకలను విడిచిపెట్టిన 66 ఏళ్ల ఎడ్మండ్ ఫౌలర్ ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ కోర్టులో చూపగా, దీనిని అసహ్యకరమైన, అత్యంత అమానుషమైన చర్యగా అభివర్ణించారు.

వివరాలు చుస్తే గత నెల మే, జూన్ మధ్య నాలుగుసార్లు ఎడ్మండ్ ఫౌలర్ ఈ చర్యలకు పాల్పడ్డాడు. తన కారు డిక్కీలో బోనులో  ఉన్న  ఎలుకలను తీసి మసీదు ముందు విడిచిపెట్టాడు. అంతేకాకుండా మసీదులోకి వెళ్లే వారిపై జాత్యహంకార నినాదాలు చేశాడు. ఎడ్మండ్  ఫౌలర్ సొంతంగా రికార్డు చేసిన ఓ వీడియోలో ఎలుకలతో మీరు ఎక్కడికి వెళ్తున్నారో ఊహించండి, బై బై చెప్పండి, నేను మీకు సరైన దిశలో ఉంచుతాను అంటున్నట్లు వినిపిస్తుంది. 

షెఫీల్డ్ మెజిస్ట్రేట్ కోర్టులో ఎడ్మండ్  ఫౌలర్ తన నేరాన్ని అంగీకరించాడు. ఈ ఘటన ఫుటేజీని చూసాక కోర్ట్ అతనికి జైలు శిక్ష విధించలేదు. కానీ 18 వారాల పాటు ఏ మసీదు లేదా షెఫీల్డ్‌లోని కొన్ని ప్రాంతాల దగ్గరకు వెళ్లకుండా నిషేధం విధించారు. ఎడ్మండ్  ఫౌలర్ చేసిన పనికి షెఫీల్డ్ గ్రాండ్ మసీదు మేనేజర్ మాట్లాడుతూ, మసీదుకు వచ్చే  ముస్లింలు ఈ  వేధింపులకు ఆందోళన చెందుతున్నారని, మసీదుకు రావడానికి  కూడా చాలా భయపడుతున్నారని తెలిపారు.

నిందితుడి ఏమన్నాడంటే : ఎడ్మండ్  ఫౌలర్ తరఫు న్యాయవాదులు అతని భార్యకు రొమ్ము క్యాన్సర్ ఉండటం వల్ల మానసిక ఒత్తిడి కారణంగా ఇలాంటి పనులు చేసి ఉండవచ్చని కోర్టుకు తెలిపారు.