ఇండిగోకు షాకిచ్చిన సిబ్బంది.. 55 శాతం ఫ్లైట్స్ డిలే..

ఇండిగోకు షాకిచ్చిన సిబ్బంది.. 55 శాతం ఫ్లైట్స్ డిలే..

ఇండిగో కంపెనీకి ఉద్యోగులు షాకిచ్చారు. సంస్థ తీరుతో విసిగిపోయిన సిబ్బంది మూకుమ్మడిగా సిక్ లీవ్ పెట్టి ఎయిరిండియా ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యారు. ఇండిగో సిబ్బందిలో చాలా మంది శనివారం సిక్ లీవ్ పెట్టడంతో 55శాతం డొమెస్టిక్ ఫ్లైట్లు ఆలస్యంగా నడిచాయి. టాటా గ్రూపు సొంతం చేసుకున్న ఎయిరిండియాలో శనివారం రెండో దశ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. దీంతో మెజార్టీ ఇండిగో సిబ్బంది ఆ రోజున అనారోగ్యంగా ఉందన్న సాకుతో సెలవు తీసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. ఫలితంగా సిబ్బంది కొరతతో ఫ్లైట్ల రాకపోకలు ఆలస్యమయ్యాయి. సిబ్బంది సిక్ లీవ్ కారణంగానే ఇండిగో ఫ్లైట్లు ఆలస్యమయ్యాయన్న వార్తలపై అటు ఇండిగో గానీ, ఇటు ఎయిరిండియా గానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ చీఫ్ అరుణ్ ఈ అంశంపై స్పందించారు. ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. 

జీతాల తగ్గింపును నిరసిస్తూ సమ్మెకు సిద్ధమైన కొందరు పైలెట్లను ఇండిగో సంస్థ ఏప్రిల్ 4న సస్పెండ్ చేసింది. ఇప్పట్లో శాలరీలు పెంచే అవకాశం లేదని ఇండిగో సీఈఓ రంజోయ్ దత్తా ఏప్రిల్ 8న సిబ్బందికి పంపిన ఈ మెయిల్లో  స్పష్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇండిగో సిబ్బంది ఉద్యోగాల ఎయిరిండియా రిక్రూట్మెంట్ డ్రైవ్ కు హాజరైనట్లు తెలుస్తోంది.