మంచిర్యాల జిల్లాలో 58 మంది బెస్ట్ టీచర్ల ఎంపిక

మంచిర్యాల జిల్లాలో 58 మంది బెస్ట్ టీచర్ల ఎంపిక
  • ఈనెల 8న మంత్రులు జూపల్లి, వివేక్ చేతుల మీదుగా పురస్కారాల ప్రదానం

మంచిర్యాల, వెలుగు : 2025-–26 విద్యాసంవత్సరానికి జిల్లాలో 58 మంది ఉత్తమ టీచర్లను ఎంపిక చేసినట్టు డీఈవో యాదయ్య శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 8న నస్పూర్​లోని ఐడీవోసీలో జిల్లా ఇన్​చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, మైనింగ్ అండ్ లేబర్ మినిస్టర్ డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా ఉత్తమ టీచర్లకు అవార్డులను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.