
కామారెడ్డి, వెలుగు : జిల్లావ్యాప్తంగా డ్రంక్అండ్ డ్రైవ్ కేసుల్లో 58 మందికి కోర్టులు జైలు శిక్షలు విధించినట్లు ఎస్సీ రాజేశ్చంద్ర గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. దేవునిపల్లి పోలీస్ స్టేషన్పరిధిలో పట్టుబడిన 10 మందిలో నలుగురికి 2 రోజుల జైలు, ఆరుగురికి 1 రోజు జైలు, రూ. వెయ్యి చొప్పున జరిమానా పడిందన్నారు. దోమకొండ పీఎస్ పరిధిలో ఒకరికి 2 రోజుల జైలు, రూ. వెయ్యి జరిమానా, మాచారెడ్డి, కామారెడ్డి, భిక్కనూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒక్కొక్కరికి ఒక రోజు జైలు, రూ.వెయ్యి జరిమానా విధించారన్నారు.
కామారెడ్డిలో 14, రామారెడ్డిలో 1, దేవునిపల్లి లో 20 మందికి, భిక్కనూరులో 1, దోమకొండలో 6, రాజంపేట, సదాశివనగ్లో ఒక్కొక్కరు చొప్పున 44 మందికి రూ. వెయ్యి చొప్పున కోర్టు జరిమానా విధించిందని ఎస్పీ పేర్కొన్నారు.
ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన మహ్మద్ ఖాన్కు ఏడు రోజుల సాధారణ జైలు శిక్ష విధిస్తూ ఆర్మూర్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ గట్టు గంగాధర్ గురువారం తీర్పు ఇచ్చినట్లు ఆర్మూర్ ఎస్హెచ్వో సత్యనారాయణ గౌడ్ తెలిపారు. డ్రంక్అండ్ డ్రైవ్ నిర్వహించగా మద్యం తాగి డీసీఎం నడుపుతున్న నిజామాబాద్ కు చెందిన మహమూద్ ఖాన్ ను పట్టుకుని కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్హెచ్వో తెలిపారు.