
- నోటిఫికేషన్ రిలీజ్ చేసిన ఐబీపీఎస్
ఐబీపీఎస్ దేశవ్యాప్తంగా 11 ప్రభుత్వరంగ బ్యాంకు ల్లో 5830 క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. డిగ్రీ పాసైన అభ్యర్థులు ఆగస్టు 1వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ప్లాన్ ప్రకారం ప్రిపేరైతే బ్యాంక్ జాబ్ సులువుగా కొట్టొచ్చు. ఎగ్జామ్ ప్యాటర్న్, ప్రిపరేషన్ టిప్స్ ఈవారం..
దేశంలోని జాతీయ బ్యాంకుల్లో క్లర్క్, స్పెషలిస్ట్ ఆఫీసర్ వంటి పోస్టులను ఐబీపీఎస్ ఏటా నిర్వహిస్తోంది. ప్రస్తుతం క్లరికల్ క్యాడర్ (సీఆర్పీ) క్లర్క్స్–XI నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అయితే సులువుగా జాబ్ కొట్టొచ్చు.
భర్తీ చేసే బ్యాంకులు: బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఒవర్‌సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత రాష్ట్ర అధికారిక భాషలో చదవడం, రాయడం, మాట్లాడటం వచ్చి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి.
వయసు: 1 జులై 2021 నాటికి 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
సెలెక్షన్ ప్రాసెస్: ఆన్‌లైన్ విధానంలో ప్రిలిమ్స్ (100మార్కులు), మెయిన్స్ (200మార్కులు) పరీక్షలు ఉంటాయి. ఎగ్జామ్‌లో చూపిన మెరిట్ ఆధారంగా సెలెక్షన్ ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులను మెయిన్స్‌కు అనుమతిస్తారు. మెయిన్స్‌లో మార్కుల ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది.
ఎగ్జామ్ ప్యాటర్న్
ప్రిలిమ్స్ 100 మార్కులకు ఉంటుంది. గంట సమయం కేటాయిస్తారు. ఇందులో మూడు విభాగాలు ఉంటాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి 30 ప్రశ్నలకు 30 మార్కులు ఉంటాయి. న్యూమరికల్ ఎబిలిటి నుంచి 35 ప్రశ్నలు వస్తాయి. 35 మార్కులు ఉన్నాయి. రీజనింగ్ ఎబిలిటి నుండి 35 ప్రశ్నలకు 35 మార్కులు కేటాయించారు. ప్రతి విభాగానికి కటాఫ్ మార్క్ సాధించాలి. ఒక్కో పార్ట్‌కు 20 నిమిషాల సమయం కేటాయించారు.
మెయిన్స్ ఎగ్జామ్ 200 మార్కులకు ఉంటుంది. ఇందులో నాలుగు విభాగాలు ఉంటాయి. జనరల్ ఫైనాన్స్/అవేర్నెస్ నుంచి 50 ప్రశ్నలకు 35 నిమిషాల సమయం కేటాయించారు. 50 మార్కులకు ఉంటుంది. జనరల్ ఇంగ్లిష్ 40 మార్కులకు ఉంటుంది. 40 ప్రశ్నలు 35 నిమిషాల్లో పూర్తి చేయాలి. రీజనింగ్ ఎబిలిటి/కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 50 ప్రశ్నలకు 45 నిమిషాల సమయం ఉంటుంది. 60 మార్కులు ఉంటాయి.క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 ప్రశ్నలకు 50 మార్కులు ఉంటాయి. 45 నిమిషాల సమయం కేటాయించారు. ప్రిలిమ్స్, మెయిన్స్‌లో నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
కటాఫ్ మార్క్స్: కటాఫ్ మార్కులు అభ్యర్థుల సంఖ్య, రాష్ట్రాల్లోని ఖాళీలు, క్వశ్చన్ పేపర్‌పై ఆధారపడి ఉంటుంది. 2018లో తెలంగాణలో 58.25, 2019లో 61, 2020లో 74.25గా కటాఫ్ ఉంది.
ప్రిపరేషన్ ప్లాన్: ప్రిలిమ్స్, మెయిన్స్‌కు ఉమ్మడి ప్రిపరేషన్ కొనసాగించాలి. ప్రీవియస్ పేపర్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే ఏ టాపిక్ నుంచి ప్రశ్నలు వస్తున్నాయో తెలుస్తుంది. బ్యాంక్ ఎగ్జామ్‌లో టైమ్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యం. అర్థమెటిక్, రీజనింగ్ బేసిక్స్ నుంచి హై లెవల్ వరకు సాధన చేయాలి. టైమ్ టేబుల్ సెట్ చేసుకొని ప్రిపరేషన్ పూర్తి చేసి, రివిజన్‌కు ఎక్కువ సమయం కేటాయించాలి. కరెంట్ ఎఫైర్స్ కోసం ప్రతి రోజు న్యూస్ పేపర్స్ చదవాలి. ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అయితే క్లర్క్ కొలువు సులువుగా కొట్టొచ్చు.
ముఖ్యసమాచారం
దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.
అప్లికేషన్స్ ప్రారంభం: 12 జులై
చివరి తేది: 1 ఆగస్టు
ఎగ్జామ్ సెంటర్స్: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్
ఆన్‌లైన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్: ఆగస్టు 28, 29, సెప్టెంబర్ 4 తేదీల్లో ఉంటుంది.
మెయిన్స్ ఎగ్జామ్: 31 అక్టోబర్
వెబ్‌సైట్: www.ibps.in