
తెలుగు సినిమాల్లో కనిపించే చాలామంది హీరోయిన్లు ఇతర భాషల వాళ్లే. అయినా నటించాలనే తపనతో ఇండస్ట్రీకి వచ్చి, భాష రాకపోయినా తమ టాలెంట్‌తో ఆకట్టుకుంటూ వస్తున్నారు. అయితే, ఈ తమిళ అమ్మాయి మాత్రం టాలీవుడ్‌కి వచ్చీరాగానే.. తెలుగులో స్పీచ్ అదరగొట్టేసింది. పొల్లుపోకుండా తెలుగులో అనర్గళంగా మాట్లాడి ఆడియెన్స్‌ని మెస్మరైజ్ చేసింది. అయితే మిగతా సినిమాల్లో హీరోయిన్ అయినా ప్రస్తుతం చేసిన త్రీబీహెచ్‌కేలో ఒక పాత్ర పోషించింది.
కానీ, ఈ విషయంలోనూ అభిమానులను సర్ప్రైజ్ చేసింది ఈ బ్యూటీ. మామూలుగా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చినవాళ్లు సపోర్టింగ్ రోల్స్ చేయాలంటే చాలా టైం పడుతుంది. కానీ, తను మాత్రం పాత్ర నచ్చడంతో మూడో సినిమాలోనే ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ చేసింది. అంతేనా.. ‘గుడ్‌నైట్’అనే తమిళ డబ్బింగ్ సినిమా చూసిన వాళ్లంతా అందులో ‘అను’ఎంత బాగుంది! అనుకునేలా చక్కగా నటించింది.
ఇలాంటి అమ్మాయి మన లైఫ్‌లోకి వస్తే ఎంత బాగుండు! అని యూత్ కలలు కనడం కూడా మొదలుపెట్టారు. ఇంతలోనే పెండ్లి చేసుకుని అభిమానులకు షాక్ ఇచ్చింది ఈ నటి. ఇలా ఒకదానిమీద ఒక సర్ప్రైజ్ ఇచ్చిన ఈమె ఎవరంటే.. మీతా రఘునాథ్.
మీతా రఘునాథ్:
మీతా రఘునాథ్ చెన్నై అమ్మాయి. ప్రస్తుతం నటిగా రాణిస్తోంది. తమిళంలో సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటిస్తోంది. ఆమె నటించిన మొదటి చిత్రం ‘ముధల్ నీ ముడివుమ్ నీ’. ఇది 2022లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అదే సంవత్సరంలో టీవీలో డాన్స్ డ్రామాగా రూపొందిన ఒక సిరీస్‌లో నటించింది. ఆ తర్వాత ఏడాది గుడ్ నైట్ అనే సినిమాలో నటించి మెప్పించింది మీతా.
ఈ సినిమా తెలుగుతోపాటు మిగతా భాషల్లోనూ రిలీజ్ అయింది. దీంతో మీతా ఇతర భాషల్లోనూ ఫ్యాన్స్‌ని సంపాదించుకుంది. ఆ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి పలు టీవీ షోల్లో గెస్ట్‌గా అలరించింది. ఈ క్రమంలో ‘సిరు కూడు’ అనే తమిళ మ్యూజిక్ వీడియో కూడా చేసింది.
అలా పెంచారు..
నేనూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచే వచ్చా. మధ్యతరగతి కుటుంబంలో ఉండే కష్టాలు నాకు తెలుసు. మా పేరెంట్స్ ఇద్దరూ వర్కింగ్. నేను మా అక్కతో కలిసి స్కూల్‌కి వెళ్లేదాన్ని. మేం బాగా చదువుకోవాలని చెప్పేవాళ్లు. నాది లవ్ మ్యారేజ్. రెండేండ్లపాటు ప్రేమలోఉన్న మేం ఈ ఏడాదే పెండ్లి చేసుకున్నాం. మేం ఇద్దరం ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఒక స్థాయికి వచ్చినవాళ్లం. మాకు మిడిల్ క్లాస్ లైఫ్ చాలా నేర్పించింది. చిన్నప్పుడు మేం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు మా నాన్న ఏం చెప్పేవాళ్లంటే... మీరు ఎంత కష్టపడితే అంత పెద్ద స్థాయికి వెళ్తారు.
ఆడపిల్లలు అయిన మీరు ఇండిపెండెంట్‌గా బతకడం నేర్చుకోవాలి. మీ లైఫ్‌కి మీరే రెస్పాన్సిబిలిటీ అని చెప్పేవాళ్లు. నేను ఇండస్ట్రీకి వస్తానన్నప్పుడు కూడా ఎవరూ అడ్డు చెప్పలేదు. నిజానికి నా సినిమాల గురించి మా పేరెంట్స్ నిజాయితీగా చెప్తారు. కానీ నువ్వు ఇది చేయొద్దు.. అలా చేయొద్దు అని ఎప్పుడూ చెప్పలేదు. నాతో ఉన్నవాళ్లంతా నన్ను ఎంకరేజ్ చేయాలనే చూస్తారు. ఇలాంటి ఫ్యామిలీ ఉన్నందుకు నేను చాలా లక్కీ అని ఫీలవుతున్నా.
సినిమా కెరీర్
నా మొదటి సినిమా షూటింగ్ టైంలో చాలా ఎగ్జయిట్మెంట్ ఫీలయ్యా. అది నాకు లెర్నింగ్ ప్రాసెస్ కూడా. అందులో స్కూల్ స్టూడెంట్‌గా నటించడం చాలా హ్యాపీగా అనిపించింది. మా స్కూల్ మెమొరీస్ కూడా గుర్తొచ్చాయి. ఫస్ట్ సినిమా అయినా ఎలాంటి భయాలు లేకుండా నటించగలిగా. అందుకు కారణం మా డైరెక్టర్, తోటి నటీ నటులు.. నన్ను బాగా సపోర్ట్ చేశారు. డైరెక్టర్ మా క్యారెక్టర్స్‌ని తన ఆలోచనల్లో ఉన్న విధంగానే చూపించారు. అందుకోసం మాకు క్యారెక్టర్ స్కెచ్‌లు కూడా ఇచ్చారు. ఎవరు ఎలా చేయాలి? అని వివరించేవారు. దానివల్ల మేం ఇంకా బాగా పర్ఫామ్ చేసేందుకు హెల్ప్ అయింది.
►ALSO READ | Samantha: కన్నీళ్లతోనే హీరోయిన్ సమంత స్పీచ్.. వీడియో వైరల్..
కొత్త వాళ్లమైనా ఎలాంటి తేడా చూపించకుండా బాగా చూసుకున్నారు. సినిమా రిలీజ్ అయ్యాక ప్రేక్షకులు కూడా కొత్త వాళ్లను చూసినట్లు కాకుండా కేవలం మా పాత్రలను చూసి మెచ్చుకున్నారు. ఈ సినిమాలో నా పాత్ర పేరు ‘రేఖ’. ఆ సినిమా చేసే టైంకి నా పేరు మీతా అని ఆడియెన్స్‌కు తెలియదు కాబట్టి అందరూ నన్ను రేఖగానే గుర్తుపెట్టుకున్నారు. నా స్కూల్ లైఫ్ కూడా ఈ సినిమాలో లాగానే అనిపించేది. ‘గుడ్ నైట్’సినిమాలో అవకాశం రావడం నా అదృష్టం.
కెరీర్ బిగినింగ్‌లోనే మంచి క్యారెక్టర్ వచ్చింది. అది చూశాక అందరూ నన్ను వాళ్ల ఇంట్లో అమ్మాయిలా ఫీలయ్యారు. చాలా ప్రశంసలు వచ్చాయి. సక్సెస్ ఎలా ఉంటుందో నాకు చూపించిన సినిమా అది. ఆ సినిమా ఇతర భాషల్లోనూ రిలీజ్ కావడంతో మిగతా ఆడియెన్స్ కూడా నా పాత్రకు అభిమానులయ్యారు. అది నాకు చాలా సంతోషాన్నిచ్చింది. రెండో సినిమాతోనే ఇన్ని భాషల్లో గుర్తింపు లభించినందుకు హ్యాపీగా ఉంది.
నా బెస్ట్ ఫ్రెండ్
‘గుడ్ నైట్’సినిమా షూటింగ్ పూర్తయ్యి, రిలీజ్ కావాల్సి ఉంది. ఆ టైంలోనే నేను ఆయన్ను కలిశా. కొద్దిరోజుల్లోనే మేం బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం. పెండ్లి చేసుకున్నాం. ఎవరి కెరీర్ వాళ్లకు ఉంది. హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాం. ఇప్పటికీ ఫ్రెండ్స్‌లానే ఉంటాం.
సిద్ధార్థ్‌కు చెల్లిగా..
ఒక సినిమాలో హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకుని, మరో సినిమాలో హీరోకి చెల్లిగా చేయాలంటే చాలామంది నటులు అంత ఈజీగా ఒప్పుకోరు. కానీ, మీతా మాత్రం అందుకు భిన్నం. సిద్ధార్థ్ నటించిన ‘త్రీబిహెచ్కె సినిమాలో తనకు చెల్లి పాత్రలో కనిపించింది. అంతేకాదు.. ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొని అచ్చ తెలుగు అమ్మాయిలా స్పీచ్ ఇచ్చి టాలీవుడ్ ఆడియెన్స్‌ని ఆకట్టుకుంది. ఈ సినిమా గురించి మీతా.. ‘‘డైరెక్టర్ వచ్చి నాకు ఈ కథ చెప్పినప్పుడు అందులోని పాత్రలు ఎలా మాట్లాడతాయో అదే యాసలో నాకు వినిపించారు.
Doors are opening soon from JULY 4TH🏡
— Shanthi Talkies (@ShanthiTalkies) June 25, 2025
9 days to go for #3bhk#3bhkfromjuly4 #3bhktamil #3bhktelugu #Siddharth @realsarathkumar @sri_sriganesh89 #Devayani @RaghunathMeetha @Chaithra_Achar_ @iYogiBabu @iamarunviswa @dineshkrishnanb #JithinStanislaus @amritramnath23… pic.twitter.com/SIhet29S4d
ఆ తర్వాత నేను ఆ స్క్రిప్ట్ తీసుకుని చదువుతున్నప్పుడు కంప్లీట్‌గా పాత్రలో ఇన్వాల్వ్మెంట్ వచ్చింది. యాక్టింగ్ చేసేటప్పుడు పాత్రలా కాకుండా నేచురల్‌గా చేశాం. నార్మల్‌గానే నేను చేసే ప్రతి సినిమాలో నా క్యారెక్టర్‌కి ఎంతో కొంత రిలేట్ అవుతాను. ఈ సినిమాలో ‘ఆర్తి’అనే రోల్‌కి బాగా కనెక్ట్ అయ్యాను.
ప్రతి ఇంట్లో ఉండే ఒక అమ్మాయి పాత్ర ఇది. డైరెక్టర్ ఈ కథను చాలా బాగా తీర్చిదిద్దారు. ఆయన విజన్ గొప్పగా ఉంటుంది. ప్రతి పాత్ర ఎలా ఉండాలనే క్లారిటీ ఉన్న వ్యక్తి. ఈ సినిమా చూస్తున్నంతసేపూ ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోని ఒక క్యారెక్టర్‌తో రిలేట్ అవుతూ ఉంటారు. ఆడియెన్స్ మనసులో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా ఇది”అని చెప్పింది.