గురుకులాల్లో 5వ తరగతి ఎంట్రెన్స్

గురుకులాల్లో 5వ తరగతి ఎంట్రెన్స్

తెలంగాణ గురుకులాల్లో(టీఎస్‌‌‌‌డబ్ల్యూఆర్‌‌‌‌ఈఐఎస్‌‌‌‌,టీటీడబ్ల్యూఆర్‌‌‌‌ఈఐఎల్‌‌‌‌,ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌‌‌‌ఈఐఎస్‌‌‌‌, టీఆర్‌‌‌‌ఈఐఎస్‌‌‌‌) 2024-–25 విద్యా సంవత్సరానికి అయిదో తరగతి (ఇంగ్లీష్​ మీడియం)లో అడ్మిషన్స్​కు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ప్రకటన విడుదల చేసింది.

విద్యార్హత :  విద్యార్థులు సంబంధిత జిల్లాల్లోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లోఋ     నాలుగో తరగతి 2023-–24 విద్యా సంవత్సరంలో చదివి ఉండాలి. జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి సంబంధిత జిల్లాలోని పాఠశాలల్లో చదువుతూ ఉండాలి. ఓసీ, బీసీ, బీసీ విద్యార్థులు 9 నుంచి 11 ఏళ్ల మధ్య; ఎస్సీ/ ఎస్టీ విద్యార్థులు 9 నుంచి 13 ఏళ్ల మధ్య ఉండాలి. 

ఎగ్జామ్​ ప్యాటర్న్​:  ప్రవేశ పరీక్ష ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఓఎంఆర్‌‌‌‌ షీట్‌‌‌‌ విధానంలో 100 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం తెలుగు/ ఇంగ్లీష్​ మీడియంలో ఉంటుంది. తెలుగు(20 మార్కులు), ఇంగ్లీష్(25 మార్కులు), గణితం(25 మార్కులు), మెంటల్‌‌‌‌ ఎబిలిటీ(10 మార్కులు), పరిసరాల విజ్ఞానం(20 మార్కులు) సబ్జెక్టులో నాలుగో తరగతి స్థాయిలో ప్రశ్నలు అడుగుతారు.

సెలెక్షన్ :  అర్హులైన అభ్యర్థులకు ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు. జనవరి 6 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంట్రెన్స్​ ఎగ్జామ్​ ఫిబ్రవరి 11న నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు www.tgcet.cgg.gov.in వెబ్​సైట్​లో చూసుకోవాలి.