TSPSC : పేపర్ లీక్ నిందితుల 6 రోజుల కస్టడీ

TSPSC : పేపర్ లీక్ నిందితుల 6 రోజుల కస్టడీ

టీఎస్పీఎస్సీ పేపర్​ లీక్​ ఘటనలో ప్రవీణ్ ​సహా మరో ఎనిమిది మంది నిందితులపై కేసులు నమోదయ్యాయి. మొత్తం తొమ్మిది మంది నిందితులకు మరో ఆరు రోజుల పోలీస్ కస్టడీ విధించారు. నిందితులను 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ కు స్పందించిన కోర్టు 6 రోజుల కస్టడీకి పర్మిషన్ ఇచ్చింది. నిందితులను రేపటి (మార్చి 18) నుంచి మార్చి 23 వరకు పోలీస్ కస్టడీలో ఉండనున్నారు. రేపు ఉదయం 9:30 నుంచి సిట్ విచారణ జరగనుంది. ఈ క్రమంలో నిందితుల నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు విచారణ చేపట్టనున్నారు.

ఈ వ్యవహారంలో ఇంకెన్ని పేపర్లు లీక్ చేశారన్న దానిపై నిందితులను విచారించే చాన్స్ కనిపిస్తోంది. ఆ తొమ్మిది మంది నిందితులను ప్రస్తుతం చెంచల్ గుడా సెంట్రలో జైల్ కి తరలించారు. అయితే, ఇప్పటికే పేపర్ లీక్ పై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. దీంతో ఈ విచారణతో మరిన్ని నిజాలు బయటపడే ఛాన్స్ ఉంది.

ఈ ఆరు రోజుల కస్టడీలో పేపర్ లీక్ పై ప్రవీణ్ ఎంతమందిని అప్రోచ్ అయ్యాడు, ఇంకెన్ని పేపర్లు లీక్ చేశాడు అన్న దానిపై విచారణ జరగనుంది. ఈ విచారణతో మరికొంత మంది నిందితులు బయటికి వచ్చే అవకాశం ఉంది.