సీవీ ఆనంద్ పేరుతో .. 6 ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్లు

సీవీ ఆనంద్ పేరుతో .. 6 ఫేక్ ఫేస్ బుక్  అకౌంట్లు
  • సీవీ ఆనంద్ పేరుతో .. 6 ఫేక్ ఫేస్ బుక్  అకౌంట్లు
  • డబ్బులు పంపాలన్న రిక్వెస్ట్​కు రూ.80‌‌‌‌ వేలు ట్రాన్స్‌‌ఫర్ చేసిన హైదరాబాదీ
  • ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్న పోలీసులు

హైదరాబాద్‌‌, వెలుగు : ఏసీబీ డీజీ సీవీ ఆనంద్‌‌ పేరుతో ఆరు ఫేక్  ఫేస్ బుక్  అకౌంట్లు ఉన్నట్లు సైబర్‌‌‌‌ క్రైమ్  పోలీసులు గుర్తించారు. రాజస్థాన్‌‌, జార్ఖండ్‌‌కు చెందిన సైబర్ నేరగాళ్లు ఈ ఫేక్‌‌  అకౌంట్లు క్రియేట్‌‌  చేశారని ఆధారాలు సేకరించారు. హైదరాబాద్‌‌కు చెందిన ఓ వ్యక్తి సైబర్​ నేరగాళ్లు చెప్పిన బ్యాంక్​ అకౌంట్​కు రూ.80 వేలు ట్రాన్స్​ఫర్ చేసినట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ప్రత్యేక బృందాలతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, తన పేరు, డీపీతో రెండు ఫేక్​ ఫేస్‌‌బుక్  అకౌంట్లు ఉన్నాయని సీవీ ఆనంద్‌‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్​ సిటీ సైబర్  క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి  దర్యాప్తు చేపట్టారు. ఏసీపీ చాంద్‌‌పాషా నేతృత్వంలోని టీమ్‌‌ రెండు ఫేక్  అకౌంట్లను గుర్తించి సోషల్‌‌ మీడియా నుంచి తొలగించారు. విచారణ జరుపుతున్న క్రమంలో సీవీ ఆనంద్‌‌  పేరుతో మరో నాలుగు ఫేక్  ఫేస్‌‌బుక్‌‌  అకౌంట్స్  ఉన్నట్లు గుర్తించారు. వాటిలో ఒక అకౌంట్‌‌లో డబ్బులు కావాలంటూ పెట్టిన మేసేజ్‌‌కు హైదరాబాద్‌‌కు చెందిన ఓ వ్యక్తి స్పందించాడు. గూగుల్​పేలో  రూ.80 వేలు ట్రాన్స్‌‌ఫర్  చేశాడు. ఇది నకిలీ అకౌంట్‌‌  అని తెలియడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ క్రమంలోనే సీవీ ఆనంద్‌‌  కూడా అలర్ట్​ అయ్యారు. ఫేక్‌‌  అకౌంట్లపై తన  ఫేస్‌‌బుక్‌‌లో ఆయన అప్‌‌డేట్లు పోస్ట్  చేశారు.