ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ పేలుడు.. ఆరుగురు మృతి

ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ పేలుడు.. ఆరుగురు మృతి

ఆఫ్ఘనిస్తాన్ లో బాంబు పేలుడు సంభవించింది. మార్చి 27న మధ్యాహ్నం సమయంలో కాబూల్‌లోని ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సమీపంలోని ఓ కమర్షియల్ కాంప్లెక్స్ లో  ఈఘటన చోటుచేసుకుంది.  ఈ ఘటనలో ఆరుగురు చనిపోగా, 12 మంది గాయపడ్డారు.  ఇందులో ఓ చిన్నారి కూడా ఉన్నారు.  గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన వ్యక్తిని ఆఫ్ఘన్ బలగాలు గుర్తించాయని ఆఫ్ఘనిస్తాన్ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అబ్దుల్ నఫీ టాకోర్ ట్వీట్ చేశారు. ఈ ప్రాంతంలో పేలుడు సంభవించడం ఇదేం మొదటిసారి కాదు. మూడు నెలల వ్యవధిలో ఇది రెండోసారి. ఈ ఏడాది జనవరిలో జరిగిన పేలుడులో కనీసం ఐదుగురు వ్యక్తులు మరణించారు. 

తాలిబన్లు అధికారాన్ని చేజిక్కించుకున్న తరువాత కూడా అఫ్ఘానిస్థాన్ లో బాంబు పేలుళ్లు వరుసగా జరుగుతునే ఉన్నాయి. ముఖ్యంగా మైనారిటీలు అయిన షియా, హజారాలే టార్గెట్ గా దాడులకు పాల్పడుతున్నారు.  ఏప్రిల్‌ 19న ఆఫ్గనిస్తాన్‌ రాజధాని కాబూల్‌లో బాంబు పేలుడు జరిగింది. మూడు ప్రదేశాల్లో జరిగిన బాంబు పేలుళ్లలో 25 మంది స్కూల్‌ విద్యార్ధులు మృతి చెందారు.  ఇప్పటికే తాలిబన్ల పాలనలో చిత్ర హింసలకు గురవుతున్న ఆఫ్ఘనిస్తాన్  ప్రజలను వరుస బాంబు పేలుళ్లు మరింతగా భయపెడుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ జీవనం 

ఇదిలా ఉంటే ఇప్పటికీ ప్రపంచ దేశాలు తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించలేదు. చాలా వరకు ఆఫ్ఘనిస్తాన్ విదేశాల నుంచి వచ్చే విరాళాలపైనే నెట్టుకు వస్తోంది. తాలిబాన్ పాలన ప్రారంభం అయినప్పటి నుంచి పాశ్చాత్య దేశాల నుంచి వచ్చే ఆర్థిక సహకారం నిలిచిపోయింది. దీంతో అక్కడ పేదరికం పెరిగింది. ప్రజలు తమ కిడ్నీలను అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది.