మనీ సేవ్ చేయాలంటే మార్చిలో ఈ ఆరు రోజులే లాస్ట్ ఛాన్స్

మనీ సేవ్ చేయాలంటే  మార్చిలో ఈ ఆరు రోజులే లాస్ట్ ఛాన్స్

ఇండియాలో ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకూ ఫైనాన్షియల్ ఇయర్ గా పరిగణిస్తారు. ఆర్థిక లావాదేవి లెక్కలు అన్నీ ఈ నెలల మధ్యలోనే జరుగుతుంటాయి. అయితే 2023-24 ఆర్థిక సంవత్సరం ఈనెలతో ముగుస్తోంది. అందుకే ఆరు డెడ్ లైన్ ఈనెలలోనే ఉన్నాయి. అవేంటో మీరు కచ్చితంగా తెలుసుకోవాలి. పేటీఎం ఫాస్టాగ్ యూజర్స్ కోసం నేషనల్ హైవే అథారిటీ వన్ వెహికల్ వన్ ఫాస్టాగ్ పేరుతో వేరే ఫ్లాట్ ఫాంకి మారడానికి మార్చి 31 లాస్ట్ డేడ్ గా ప్రకటించింది.

ఉచిత ఆధార్ అప్‌డేషన్: మార్చి 14
> మీ ఆధార్ కార్డ్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేయడానికి మార్చి 14 చివరి రోజు. తర్వాత ఏదైనా ఇన్ఫర్మేషన్  అప్‌డేట్‌ చేయించాలంటే ఛార్జీ విధించబడుతుంది.

మార్చి 15: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ గడువు
> పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్‌లు మార్చి 15 లోగా తమ అకౌంట్ లో డబ్బును మరొక బ్యాంకుకు బదిలీ చేసుకోవాలి. ఈ డేట్ తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ లో మనీ డిపాజిట్, క్రెడిట్ చేయడం వీలుకాదు.

> నాల్గవ టైం అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపు : 2023--ః2024 ఆర్థిక సంవత్సరానికి మీ అడ్వాన్స్ ట్యాక్స్ చివరి(నాల్గవ) వాయిదా చెల్లించడానికి ఇదే చివరి రోజు.

మార్చి 31: పన్ను ఆదా చేసే పెట్టుబడులు
>  2023- 24 ఆర్థిక సంవత్సరానికి ట్యాక్స్ పొదుపు చేయడానికి ఏవైనా ఇవ్వెస్ట్ మెంట్స్ పెట్టాలనుకుంటే దానికి మార్చి 31యే లాస్ట్ డేట్. 

2021-22కి అప్‌డేటెడ్ ITR ఫైల్ చేయడం
>  గడిచిన (2021- 22 ) ఫెనాన్షియల్ ఇయర్ కు సంబంధించిన ITR (ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్)కు అప్లై చేసుకోవడానికి చివరి  గడువు మార్చి 31, 2024. ఇప్పటి వరకూ ఏదైనా ఆదాయానికి సంబంధించిన ట్యాక్స్ కు రిటర్న్స్ పెట్టకుంటే ఇప్పడే  ITR దాఖలు చేసుకోండి. -

ALSO READ :- ఫుడ్ సరిగ్గా లేనప్పుడు హాస్టల్ ఎందుకు.. నిజాం కాలేజీ హాస్టల్ ముందు విద్యార్థుల ఆందోళన

> ట్యాక్స్ కట్టేవారు ఫైనాన్షియల్ అసెస్‌మెంట్ ఇయర్ ముగిసినప్పటీ..  24 నెలల (2 సంవత్సరాలు)లోపు అప్‌డేట్ చేసిన రిటర్న్‌ను ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి, ట్యాక్స్ పేయర్స్ 2019 -20 ఆర్థిక సంవత్సరానికి రిటర్న్ ఫైల్ చేయకుంటే, వారు మార్చి 31లోపు ఫైల్ చేయవచ్చు.