2024 -25 నాటికి రూ. 40 వేల కోట్లకు పీఎల్​ఐ ఇన్సెంటివ్స్​

2024 -25 నాటికి రూ. 40 వేల కోట్లకు  పీఎల్​ఐ ఇన్సెంటివ్స్​
  • మాన్యుఫాక్చరింగ్​ ఇండస్ట్రీకి బూస్ట్​ 
  • ప్రభుత్వ ప్లాన్​​

న్యూఢిల్లీ: ఆరు కొత్త రంగాలలో లోకల్​ మాన్యుఫాక్చరింగ్​ పెంచేందుకు రూ. 18 వేల కోట్ల ఇన్సెంటివ్స్(2.2 బిలియన్​ డాలర్లు) ​ఇవ్వాలని ప్రభుత్వం ప్లాన్​ చేస్తోంది. కెమికల్స్​, షిప్పింగ్​ కంటెయినర్స్, వ్యాక్సిన్స్​ తయారీకి అవసరమైన ప్రొడక్టులు వంటివి ఈ ఆరు రంగాలలో ఉన్నట్లు ఇద్దరు ఆఫీసర్లు వెల్లడించారు.  లోకల్ మాన్యుఫాక్చరింగ్​కు బూస్ట్​ ఇచ్చేలా 2020 లో ప్రొడక్షన్​ లింక్డ్​ ఇన్సెంటివ్​ (పీఎల్​ఐ) స్కీమును ప్రభుత్వం తెచ్చింది. ఈ   పీఎల్​ఐ  స్కీము కోసం రూ. 1.97 లక్షల కోట్లను వెచ్చించనున్నారు. ఎలక్ట్రానిక్​  ప్రొడక్టుల నుంచి డ్రోన్స్​ దాకా మొత్తం 14 సెక్టార్లకు పీఎల్​ఐ స్కీములను ప్రకటించారు. ఈ సెక్టార్లలో కొన్నింటిలో మంచి ఫలితాలు వస్తుండగా, మరి కొన్నింటిలో మాత్రం ఆశించిన మేరకు ఫలితాలు రావడం లేదు. పీఎల్​ఐ స్కీముల కోసం కేటాయించిన మొత్తంలో కొంత మాత్రమే ఇప్పటిదాకా క్లెయిమ్​ చేసుకున్నారు. దీంతో మిగిలిపోయిన మొత్తాన్ని కొత్త సెక్టార్లకు ఇవ్వాలనేది ప్రభుత్వ ఆలోచన. కొత్త సెక్టార్లను ప్రోత్సహించేందుకు ఆ నిధులను వాడుకోనున్నట్లు గవర్నమెంట్​ ఆఫీసర్లు చెబుతున్నారు. కొత్త ఆలోచనను ప్రభుత్వం ఇంకా బయటకి వెల్లడించలేదు. పీఎల్​ఐ స్కీము అమలును మానిటర్​ చేసే బాధ్యతను  కామర్స్​ మినిస్ట్రీ కి అప్పచెప్పారు.  తాజా ప్రపోజల్స్​పై ఆ మినిస్ట్రీకి పంపిన ఈమెయిల్​కు బదులు రాలేదు.

టాయ్స్​, బైసైకిల్స్​రంగాలకు ఊతం....

టాయ్స్​, బైసైకిల్స్​, లెదర్​, ఫుట్​వేర్​ రంగాలు పైన చెప్పిన ఆరు కొత్త రంగాలలో ఉంటాయని ఆఫీసర్లు చెబుతున్నారు. ఈ సెక్టార్లన్నీ రూ. 18 వేల కోట్ల ఇన్సెంటివ్స్​ను పంచుకుంటాయని వారు పేర్కొంటున్నారు. ఇండియన్​  ఎకానమీ ఎదగడానికి పీఎల్​ఐ స్కీము సాయపడుతుందని ప్రభుత్వం నమ్మకంతో ఉంది. దేశంలో ప్రైవేటు పెట్టుబడులు బాగా తగ్గిపోవడంతో కొత్త జాబ్స్​ క్రియేట్​ అవడం లేదు. ముఖ్యంగా తయారీ రంగంలో ఉపాధి అవకాశాలు పెరగడంలేదు. ఈ నేపథ్యమే పీఎల్​ఐ స్కీము తేవడానికి కారణమైంది. మార్చి 2023తో ముగిసిన ఫైనాన్షియల్​ ఇయర్లో రూ. 2,900 కోట్లను ఇన్సెంటివ్స్​గా చెల్లించారు. స్పెషాలిటీ స్టీల్​ ప్రొడక్టులు, సోలార్​ మాడ్యూల్స్​, ఆటోమొబైల్​ కాంపోనెంట్స్​ వంటి రంగాలకు కొంత  మొత్తంలోనే  ఇన్సెంటివ్స్​ చెల్లించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఫైనాన్షియల్​ ఇయర్లో పీఎల్​ఐ ఇన్సెంటివ్స్​ డిస్​బర్స్​మెంట్ ​భారీగా  పెరుగుతుందని అంచనా. 2024–25 నాటికి ఈ ఇన్సెంటివ్స్​ రూ. 40 వేల కోట్లకు చేరుతాయని గవర్నమెంట్​ ఆఫీసర్లు వెల్లడించారు. ప్రభుత్వ విశ్లేషణలో ఈ విషయం తేలిందని వారు పేర్కొన్నారు.