ఆన్​లైన్​లోనే 60% షాపింగ్

ఆన్​లైన్​లోనే 60% షాపింగ్
  •  యాప్స్ ద్వారా కొనుగోళ్లు భారీగా పెరిగినయ్​
  • చిన్న సిటీలకూ విస్తరించిన ఈ– కామర్స్​
  • ప్రైస్  వాటర్ హౌస్  కూపర్స్  రిపోర్టు వెల్లడి

హైదరాబాద్, వెలుగు: దేశంలో ఆన్​లైన్  షాపింగ్​కు రోజురోజుకు క్రేజ్ పెరుగుతోంది. యాప్స్​ ద్వారా ఆన్​లైన్​ షాపింగ్​ చేయడానికి 60 శాతం మంది ఆసక్తి చూపుతున్నారని ప్రైస్  వాటర్ హౌస్  కూపర్స్  (పీడబ్ల్యూసీ) ఇండియా విడుదల చేసిన రిపోర్టులో వెల్లడించింది. గడిచిన కొన్నేండ్లలో 12.5 కోట్ల మంది ఆన్​లైన్​లో షాపింగ్​ చేశారని రిపోర్ట్  తెలిపింది. రిపోర్టులో ఉన్న వివరాల ప్రకారం.. బయట షాపుల్లో సరుకులు తక్కువగా దొరకడం లేదా స్టాక్​ అందుబాటులో లేకపోవడం వంటి కారణాల వల్ల చాలా మంది ఆన్​లైన్​ షాపింగ్  వైపు మళ్లుతున్నారు. 

ఆన్​లైన్​ లో లేటెస్ట్ పాపులర్​ ప్రోడక్ట్స్  ఎక్కువగా​ అందుబాటులో ఉండడం, డిస్కౌంట్లు, రిఫండ్స్, నావిగేషన్, రివ్యూస్, రేటింగ్​​ వంటి సౌకర్యాల కారణంగా ఆన్ లైన్ లో షాపింగ్  చేసే వారి సంఖ్య పెరుగుతోంది. ఇటీవలి కాలంలో టైర్​ 2, 3, 4 నగరాల్లోనూ ఆన్​లైన్​ షాపింగ్​ విస్తరించింది. నిరుడు పండగల సమయంలో కొన్ని కంపెనీల యాప్స్​ నుంచి 80 శాతంపైగా ప్రోడక్ట్స్​ను కొనుగోలు చేశారు. దేశవ్యాప్తంగా వివిధ వర్గాలకు చెందిన 2,100 మందిని సర్వే చేసి వివరాలు సేకరించామని పీడబ్ల్యూసీ ఇండియా తెలిపింది.

సోషల్​ మీడియాలో చూసి...

ఆన్​లైన్​ కొనుగోళ్లలో ఫేస్​బుక్, ఇన్​స్టాగ్రాం, యూ ట్యూబ్​ లాంటి సాధనాలు ఎక్కువగా ప్రభావం చూపుతున్నాయి. ఆన్​లైన్​లో కొను గోలు చేసేవారు ఎక్కువగా సోషల్​ మీడియాలో చూసి కొనుగోలు చేస్తున్నారని పీడబ్ల్యూసీ రిపో ర్టు తెలిపింది. సోషల్​ మీడియాలో చూసి కొత్త బ్రాండ్స్​ను ట్రై చేసేవారు 62 శాతం మంది ఉన్నారని ఆ నివేదిక వెల్లడించింది. బయట షాపులతో పోలిస్తే ఆన్​లైన్​లో తక్కువ ధరలు ఉండడం, పండుగల టైమ్​లో డిస్కౌంట్స్, రిఫండ్లు ఇవ్వడంతో ఆన్ లైన్  కొనుగోళ్లు పెరుగుతున్నాయని నివేదిక తెలిపింది. రేటింగ్స్, రివ్యూస్​  చూసి షాపింగ్  చేసేవారు 45%, క్యాష్ ఆన్​ డెలివెరీ ఆప్షన్​ ఎంచుకునేవారి శాతం 35 ఉందని నివేదిక వెల్లడించింది.