
హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. గత 24 గంటల్లో 50,520 శాంపిల్స్ పరీక్షించగా.. 614 మందికి కొవిడ్ పాజిటివ్ నిర్థారణ అయింది. వీరితో కలుపుకొని ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 7,84,062కు చేరిందని వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. గత 24 గంటల్లో వైరస్ కారణంగా ఎవరూ చనిపోలేదు. నిన్న 2,387 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9,908 యాక్టివ్ కేసులున్నాయి.